టెలికం కొత్త రూల్.. భారత్‌లో ఇకపై ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉండొచ్చుంటే?

New Telecom Rule : భారతీయ పౌరులు 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డ్‌లను పొందేందుకు అనుమతి ఉండదు. అదనపు సిమ్ కార్డులను కలిగి ఉంటే మొదటిసారి రూ. 50వేలు, ఆ తర్వాత ప్రతిసారి రూ. 2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

New Telecom Rule : టెలికం కొత్త రూల్ వచ్చేసింది. మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై సిమ్ కార్డులు పరిమితికి మించి కలిగి ఉంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొత్త టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ఈరోజు (జూన్ 26, 2024) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. భారతీయులెవరూ 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డ్‌లను పొందేందుకు అనుమతి ఉండదు.

మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా 6 సిమ్ కార్డ్‌లకు మాత్రమే పొందడానికి అర్హులు. మిగతా రాష్ట్రాల్లోని భారత పౌరులు 9 సిమ్ కార్డులను పొందవచ్చు. ఇకపై అక్రమ మార్గాల్లో సిమ్ కార్డులను అవసరానికి మించి కలిగి ఉన్నట్టు రుజువైతే.. వారికి రూ. 50 లక్షల వరకు జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ కొత్త చట్టం ఏదైనా టెలికాం సర్వీసు లేదా నెట్‌వర్క్‌పై నియంత్రణ లేదా మానిటరింగ్ చేయడం నిలిపివేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది.

రూ. 50వేల నుంచి రూ.2లక్షల జరిమానా :
ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను నియంత్రించే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా 6 సిమ్ కార్డ్‌లకు మాత్రమే అర్హులు. అదనపు సిమ్ కార్డులను పొందడం వల్ల మొదటిసారి రూ. 50వేలు, ఆ తర్వాత ప్రతిసారి రూ. 2 లక్షల జరిమానా విధిస్తుంది.

అదనంగా, ఏదైనా ప్రొడక్టులు, సర్వీసుల కోసం మార్కెటింగ్ మెసేజ్‌లు, యాడ్స్ వంటివి పంపే ముందు కస్టమర్ సమ్మతిని పొందడం ఇప్పుడు తప్పనిసరి. అదనంగా, టెలికాం ప్రొవైడర్ కస్టమర్ల ఫిర్యాదులను దాఖలు చేసే ఆన్‌లైన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త చట్టం :
కొత్త టెలికం చట్టంలోని 62 నిబంధనలలో కేవలం 39 మాత్రమే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. టెలికాం బిల్లుకు గత ఏడాది డిసెంబర్ 21న రాజ్యసభ, డిసెంబర్ 20న లోక్ సభ ఆమోదం తెలిపాయి. అది చట్టంగా రూపుదాల్చడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అవసరం. ఈ చట్టంలో మొత్తం 62 సెక్షన్లలో 39 మాత్రమే ప్రస్తుతానికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 138 ఏళ్లుగా టెలికాం పరిశ్రమను శాసించిన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం వస్తుంది.

Read Also : Best Tech Deals 2024 : కొత్త ఫోన్ ఏది కొంటే బెటర్.. ఐఫోన్ 14 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లపై అదిరే ఆఫర్లు..!

కొత్త బిల్లుతో జియోకు నష్టాలు? :
అదనంగా, ఈ బిల్లుతో 1933 ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేస్తుంది. అంతేకాకుండా, 1997 నాటి ట్రాయ్ చట్టాన్ని కూడా సవరిస్తుంది. టెలికాం స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిబ్యూషన్ కోసం బిల్లులోని ఒక నిబంధన టెలికం సర్వీసులను వేగవంతం చేస్తుంది. తద్వారా అమెరికన్ వ్యాపారవేత్త, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్‌లింక్ వంటి విదేశీ వ్యాపారాలకు కొత్త బిల్లుతో భారీగా లబ్ధిపొందనున్నాయి. కానీ, రిలయన్స్ జియో కూడా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.

Read Also : Redmi Note 14 Pro Launch : రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు