Elon Musk : మస్క్ మామ మళ్లీ తండ్రి అయ్యాడు.. న్యూరాలింక్ ఉద్యోగినితో మూడో బిడ్డ.. మొత్తం 11మంది సంతానం..!

Elon Musk : ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు.  న్యూరాలింక్ ఉద్యోగిని షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ జన్మనిచ్చాడు. మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది.

Elon Musk : మస్క్ మామ ఏం చేసినా సంచలనమే. ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎవరి ఊహకు అందడు.. ఎప్పుడు ఏం చేస్తాడో ఏం బాంబు పేలుస్తాడో చెప్పడం కష్టమే. ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్, టెస్లా అధినేతగా పేరొందిన ఎలన్ మస్క్ వ్యాపారాల్లోనే కాదు.. వైవాహిక జీవితంలో పిల్లలను కనడంలో కూడా తనకు సాటిలేదనిపించుకున్నాడు.

Read Also : Elon Musk : ఈవీఎంలతో హ్యాకింగ్ రిస్క్.. ఎలన్ మస్క్‌ హెచ్చరిక.. బీజేపీ నేత రియాక్షన్ ఇదే!

ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు.  తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ పొందాడు. మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక క్రికెట్ టీమ్ తయారుచేశాడని అంటున్నారు.

పిల్లల పేర్ల మార్పు కోసం మస్క్ పిటిషన్ :
ప్రస్తుత రోజుల్లో ఒక బిడ్డను కనడమే కష్టం.. అలాంటిది మస్క్ మామ మాత్రం తన సంతానాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. జిలిస్‌తో మస్క్‌కు ఇది మూడో సంతానం. బిలియనీర్ 2021లో న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్‌తో డేటింగ్ చేసి ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. కోర్టు పత్రాల ప్రకారం.. మస్క్ కవలల పేర్లను తమ తండ్రి చివరి పేరు, వారి మధ్య పేరులో వారి తల్లి చివరి పేరును కలిగి ఉండేలా మార్చాలని పిటిషన్ కూడా దాఖలు చేశాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి, మస్క్‌కు మొత్తం ఎంత మంది పిల్లలు ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, ఆయనకు 11 మంది పిల్లలు ఉన్నారని పలు నివేదికలు వెల్లడించాయి.

ఫస్ట్ భార్యతో ఐదుగురు, గర్ల్ ఫ్రెండ్స్‌తో ఆరుగురు సంతానం :
అందులో ఆయన మొదటి భార్య, రచయిత జస్టిన్ మస్క్‌కు ఐదుగురు సంతానం జన్మించారు. ఈమెతో బ్రేకప్ అయిన తర్వాత మ్యూజిషియన్ గ్రిమ్స్‌తో డేటింగ్ చేసి మరో ముగ్గురికి మస్క్ జన్మినిచ్చారు. మస్క్ న్యూరాలింక్‌ను స్థాపించిన తర్వాత బ్రెయిన్-కంప్యూటర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీకి సహ-సీఈఓగా పనిచేస్తున్నారు. మస్క్ తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగినులతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అదే క్రమంలో మస్క్ స్పేస్‌ఎక్స్‌లోని మహిళా ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన రెండు వారాల తర్వాత జిలిస్‌తో మరో బిడ్డ గురించి వార్తలు వచ్చాయి.

జననాల రేటు పెంచడమే మస్క్ లక్ష్యం :
ఇదిలా ఉండగా, మస్క్ ఎక్కువ మంది పిల్లలు కావాలని కోరాడని మాజీ స్పేస్‌ఎక్స్ ఉద్యోగి ఆరోపించినట్లు నివేదిక పేర్కొంది. మస్క్ కోరికను ఆమె తిరస్కరించింది. చివరికి కంపెనీని విడిచిపెట్టి, 1 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ప్యాకేజీని అందుకుందని అవుట్‌లెట్ నివేదించింది. మస్క్ జననాల రేటు భారీగా తగ్గడం వల్ల కలిగే నష్టాలపై కొన్నేళ్లుగా బహిరంగంగానే ప్రస్తావిస్తున్నాడు.

ఈ సమస్యను నాగరికతకు అతిపెద్ద ముప్పుగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. అందుకే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటానికి తన స్నేహితులను ప్రోత్సహించినట్లు కూడా చెప్పాడు. మస్క్ న్యూరాలింక్ ఉద్యోగి జిలిస్‌తో కవలలకు జన్మనిచ్చారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించిన ఒక రోజు తర్వాత అండర్‌పాపులేషన్ సంక్షోభానికి తన వంతు కృషి చేస్తున్నానని మస్క్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. మస్క్, జిలిస్ కు మూడో బిడ్డ జన్మించిన వార్తలపై వారిద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు.

Read Also : Elon Musk : భవిష్యత్తులో ఇక ఫోన్‌లు ఉండవు.. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే.. ఎలన్ మస్క్

ట్రెండింగ్ వార్తలు