iQoo 11 5G Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ 11 5జీపై అదిరే డిస్కౌంట్.. ఫ్రీగా వివో TWS ఇయర్‌బడ్స్ పొందొచ్చు!

iQoo 11 5G Discount : అమెజాన్ ఇండియా సేల్‌లో ఐక్యూ 11 5G ఫోన్ కొనుగోలుపై రూ. 10వేలు తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. రూ. 3వేల కన్నా విలువైన వివో టీడబ్ల్యూఎస్ ఎయిర్ ఇయర్‌బడ్‌లను కూడా ఉచితంగా పొందవచ్చు.

iQoo 11 5G is available for less than Rs 50,000 and you can get free earbuds

iQoo 11 5G Discount : కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ఇండియాలో రూ.10వేల తగ్గింపు ధరతో ఐక్యూ 11 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఐక్యూ ఫోన్ అనేది పవర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్. డిజైన్ పరంగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఐక్యూ 11 5జీ రూ. 60వేల వద్ద లాంచ్ కాగా.. సేల్స్ సమయంలో, ఈ డివైజ్ అమెజాన్ ఇండియాలో రూ. 10వేల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఐక్యూ సేల్ వీక్‌లో భాగంగా, అమెజాన్‌లో ఐక్యూ 11 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 51,999కి అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 14 Deals : ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్.. రూ.60వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

బ్యాంకు కార్డులపై రూ.2వేల ప్లాట్ డిస్కౌంట్ :
అంతేకాదు.. మీరు ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే.. ఐక్యూ 11 మోడల్ ధర రూ.49,999కి తగ్గింది. మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఐక్యూ 11 కొనుగోలు చేయాలనుకుంటే.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల తగ్గింపును కూడా పొందవచ్చు.

రూ.3వేలు విలువైన వివో ఇయర్‌బడ్స్ ఉచితం :
అప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 48,999కి తగ్గుతుంది. మీరు ఐక్యూ 11 5జీని కొనుగోలు చేసే ముందు ఇతర బ్యాంక్ ఆఫర్‌లు, ఈఎంఐ డీల్‌లు కూడా ఉన్నాయి. అదనంగా, ఐక్యూ 11 5జీ కొనుగోలుపై, వివో టీడబ్ల్యూఎస్ ఎయిర్ ఇయర్‌బడ్‌లను ఉచితంగా పొందవచ్చు. ఇయర్‌బడ్‌ల మార్కెట్ ధర రూ. 3వేలు కన్నా ఎక్కువగానే ఉంటుంది.

iQoo 11 5G free earbuds

ఐక్యూ 11 5జీ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్‌సెట్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఐక్యూ 11 5జీ ఇతర హైలైట్ ఫీచర్లలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. అదనంగా 4కె సూపర్ నైట్ వీడియో ఫీచర్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.

గేమర్స్ కోసం ప్రత్యేకమైన మోషన్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఐక్యూ 11 5జీ కూడా 2కె ఈ6 అమోల్డ్ డిస్‌ప్లేతో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గేమింగ్, ఫొటోగ్రఫీ పర్ఫార్మెన్స్ మెరుగుపరిచే ప్రత్యేకమైన వి2 చిప్‌తో వస్తుంది. ఐక్యూ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్.. ఐక్యూ 11ని క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీపై రన్ అయ్యే మునపటి వెర్షన్ కన్నా 20 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Apple iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.39వేలు మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

ట్రెండింగ్ వార్తలు