iQOO Z9x Launch : భారీ బ్యాటరీతో ఐక్యూ Z9x ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 12వేలు మాత్రమే!

iQOO Z9x Launch : ఈ ఫోన్ 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 37 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

iQOO Z9x with Snapdragon 6 Gen 1 chipset, 6000mAh battery launched in India

iQOO Z9x Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐక్యూ కంపెనీ నుంచి సరికొత్త ఐక్యూ Z9x ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఐక్యూ Z9x అల్ట్రా-స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. కేవలం 7.99ఎమ్ఎమ్ సెగ్మెంట్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ప్రత్యేక ఫీచర్లలో మముత్ 6000ఎంఎహెచ్ బ్యాటరీ ఒకటి. ఒకే ఛార్జ్‌తో రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : BMW M 1000 XR Launch : అద్భుతమైన ఫీచర్లతో బీఎండబ్ల్యూ M 1000 ఎక్స్ఆర్ బైక్, 278కి.మీ టాప్ స్పీడ్.. భారత్‌లో ధర ఎంతంటే?

అంతేకాకుండా, ఈ ఫోన్ 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 37 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ టోర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.

భారత్‌లో ఐక్యూ జెడ్9ఎక్స్ ధర ఎంతంటే? :
ఐక్యూ Z9ఎక్స్ మొత్తం 3 వేరియంట్‌లలో వస్తుంది.
4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999 ఉండగా ధర రూ.11,999 కొనుగోలు చేయొచ్చు.
6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,499 ఉండగా, రూ.12,999కు పొందవచ్చు.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999 ఉండగా, ధర రూ.14,499కు కొనుగోలు చేయొచ్చు.

భారత్‌లో ఐక్యూ జెడ్9ఎక్స్ స్పెసిఫికేషన్‌లు :
ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఉంది. లేటెస్ట్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ పవర్‌హౌస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల అల్ట్రా బ్రైట్ 120హెచ్‌జెడ్ అడాప్టివ్ డిస్‌ప్లే డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో వస్తుంది. ఆడియో వ్యూజువల్ అందిస్తుంది. ఐక్యూ జెడ్9ఎక్స్ అనేది అమెజాన్‌లో ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ కలిగిన ఏకైక డివైజ్ అని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా సరికొత్త ఫన్‌టచ్ ఓఎస్ 14తో రన్ అవుతున్న ఈ డివైజ్ 2+3 ఏళ్ల ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఐక్యూ Z9ఎక్స్ 6000ఎంఎహెచ్ అల్ట్రా-సన్నని గ్రాఫైట్ బ్యాటరీని కలిగి ఉంది. ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 44డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌తో కలిపి డివైజ్ కేవలం 37 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్, యాంటీ ఏజింగ్ ఛార్జింగ్ అల్గోరిథం వంటి అదనపు ఫీచర్లు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతాయి. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.

ఐక్యూ Z9x తక్కువ విద్యుత్ వినియోగంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8జీబీ ర్యామ్, అదనంగా 8జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో పాటు, మల్టీ టాస్కింగ్‌ని అందిస్తుంది. యూజర్ల ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకే సమయంలో 27కి పైగా యాప్‌లను రన్ చేయొచ్చు. 50ఎంపీ ఏఐ బ్యాక్ కెమెరా సిస్టమ్‌తో ఐక్యూ Z9ఎక్స్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్‌ చేయొచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. వివో గ్రేటర్ నోయిడాలో ఐక్యూ Z9ఎక్స్ ఫోన్‌ను దేశవ్యాప్తంగా 670కి పైగా కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ సెంటర్‌ల ద్వారా సర్వీసును అందిస్తుంది.

Read Also : Cyber Alert : మీరు వాడేది ఇవేనా? 10 అత్యంత సాధారణ 4-డిజిట్ పిన్‌లివే.. తస్మాత్ జాగ్రత్త.. వెంటనే పిన్ మార్చుకోండి..!

ట్రెండింగ్ వార్తలు