రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Crop Loan Waiver : రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ ఉంటుందన్నారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రేషన్ కార్డు ఆధారంగా చేయడం అన్నది కరెక్ట్ కాదంటున్నాయి. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డు నిబంధనపై ఆయన స్పష్టత ఇచ్చారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డు ను పెట్టడం జరిగిందన్నారు. కుటుంబ పెద్దను గుర్తించడానికి రేషన్ కార్డు నిబంధనను తీసుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు. పాసు బుక్ ఆధారంగానే కుటుంబానికి 2లక్షల పంట రుణమాఫీ ఇస్తామన్నారు.

రుణమాఫీకి సంబంధించి రేవంత్ ప్రభుత్వం నిన్న నిబంధనలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు నిబంధనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదంది. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు నిబంధన అని, పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు.

Also Read : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు