Sourav Ganguly : గంగూలీకి షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. ఆశ‌లు ఆవిరి..!

పాంటింగ్‌ను త‌ప్పిస్తున్న‌ట్లు ఢిల్లీ జట్టు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌ముందే ఆ జ‌ట్టు డెరైక్ట‌ర్ ఆఫ్ క్రికెట్ సౌర‌వ్ గంగూలీ ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పాడు.

DC unlikely to appoint Ganguly as head coach Reports

Sourav Ganguly – Delhi Capitals : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో 17 సీజ‌న్లు పూర్తి అయ్యాయి. ఈ టోర్నీలో ఐపీఎల్ ట్రోపీని ఒక్క‌సారి కూడా అందుకోని మూడు జ‌ట్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఉంది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లోనూ ఢిల్లీ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలో 14 మ్యాచులు ఆడిన ఢిల్లీ ఏడు మ్యాచుల్లో గెలిచి మ‌రో 7 మ్యాచుల్లో ఓడింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఈ క్ర‌మంలో ఏడేళ్లుగా ప్ర‌ధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.

2018లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అత‌డి హ‌యాంలో ఢిల్లీ 2019 నుంచి వ‌రుస‌గా మూడు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 2020లో ఏకంగా ఫైన‌ల్‌కు చేరింది. అయితే.. ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌డ‌బ‌డి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆ త‌రువాత క‌నీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేర‌లేక‌పోయింది. వ‌రుస వైఫ‌ల్యాల కార‌ణంగా పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్య‌త‌ల నుంచి ఢిల్లీ త‌ప్పించింది.

BCCI : టీమ్ఇండియా టెస్టు క్రికెట‌ర్ల‌కు షాకిచ్చిన బీసీసీఐ..! జ‌ట్టులో ప్లేస్ కావాలంటే..

అయితే.. పాంటింగ్‌ను త‌ప్పిస్తున్న‌ట్లు ఢిల్లీ జట్టు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌ముందే ఆ జ‌ట్టు డెరైక్ట‌ర్ ఆఫ్ క్రికెట్ సౌర‌వ్ గంగూలీ ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పాడు. కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. దీంతో గంగూలీ ఢిల్లీ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌డ‌తాడ‌ని అంతా అనుకున్నారు. అయితే.. అత‌డిని కోచ్‌గా చేసేందుకు ఢిల్లీ యాజ‌మాన్యం ఆస‌క్తిగా లేన‌ట్లుగా తెలుస్తోంది.

డైరెక్ట‌ర్ ఆఫ్ క్రికెటర్‌గా ఉన్న గంగూలీ ఇప్ప‌టికే ఎన్నో ప‌నులు చేస్తున్నాడ‌ని, ఇప్పుడు కోచ్‌గా నియ‌మించి అత‌డిపై మ‌రిన్ని బాధ్య‌త‌లు వేసేందుకు డీసీ సిద్ధంగా లేద‌ట‌. జ‌ట్టును దూకుడుగా న‌డిపించే గౌత‌మ్ గంభీర్ వంటి కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషిస్తుంది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలం ఉంది. ఈ లోపు గంభీర్ లాంటి వ్య‌క్తిని కోచ్‌గా నియ‌మించాల‌ని ఢిల్లీ మేనేజ్‌మెంట్ ప‌ట్టుద‌ల‌గా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. డీసీ మేనేజ్‌మెంట్ నిర్ణ‌యంతో కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌న్న గంగూలీ ఆశ‌లు ఆవిరి అయ్యాయి.

IND vs SL : శ్రీలంక‌తో సిరీస్‌కు ముందే టీమ్ఇండియాకు షాక్‌.. వ‌న్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం..!

ట్రెండింగ్ వార్తలు