IRCTC Down : ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం.. స్తంభించిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులు!

IRCTC Down : ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసే వెబ్‌సైట్ సహా మొబైల్ అప్లికేషన్ సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

IRCTC Down _ E-ticketing facility temporarily affected due to technical reasons

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసులు పూర్తిగా స్తంభించాయి. వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ అప్లికేషన్ సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నవంబర్ 23 ఉదయం నుంచి ఈ సాంకేతిక లోపం ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన అనేక మంది ఐఆర్‌సీటీసీ యూజర్లకు ఇలా మెసేజ్ కనిపిస్తోంది. టికెట్లను బుకింగ్ చేసుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే తమకు ఒక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోందంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. మెయింటెనెన్స్ కారణంగానే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా మెసేజ్ కనిపిస్తోంది.

IRCTC Down

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (https://www.irctc.co.in/) మాత్రమే కాదు.. మొబైల్ యాప్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది యూజర్లకు కనెక్టివిటీ ఇష్యూ అనే మెసేజ్ వస్తోందని యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. తత్కాల్ ట్రైన్ టికెట్ల కోసం ప్రయత్నించినా కూడా ఇదే సమస్య తలెత్తినట్టు వాపోతున్నారు. ఈ సాంకేతిక సమస్యపై ఐఆర్‌సీటీసీ అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ సాంకేతిక బృందం లోపానికి సంబంధించి పనిచేస్తోందని, అతి త్వరలోనే బుకింగ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

సిటీ సెంటర్‌లోని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని ఒక మెసేజ్ ఇలా కనిపిస్తోంది.. ఇ-టికెట్ సర్వీసుల్లో తాత్కాలిక అంతరాయంపై వినియోగదారులకు తెలియజేసింది. ‘మెయింటెనెన్స్ కార్యకలాపాల కారణంగా, ఇ-టికెట్ సర్వీసు అందుబాటులో లేదు. దయచేసి తర్వాత టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించండి. టీడీఆర్ రద్దు చేయడానికి/సమర్పించడానికి, కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయండి. 14646,0755-6610661. 0755-4090600 లేదా etickets@irctc.co.inకు మెయిల్ పంపండి. సాంకేతిక సమస్యల కారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఇప్పటికీ డౌన్‌లో ఉంది.

ఈరోజు ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ సర్వీసులు నిలిచిపోయాయని యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికింగ్ బుకింగ్ చేసుకున్నవారికి క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్ పేజీలో సాంకేతిక సమస్య ఉందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు. ఈ సమస్య ప్రస్తుతం అలానే ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితిలో బుకింగ్ పేమెంట్లు చేయలేకపోతున్నామని అంటున్నారు. పేమెంట్ చేసినా బుకింగ్ కావడం లేదని వాపోతున్నారు. అలాగే ఐఆర్‌సీటీసీ పేమెంట్ చేసిన తర్వాత ఎర్రర్ సమస్యను చూపుతోంది. ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పారంటూ వినియోగదారులు మండిపడుతున్నారు.

Read Also : SBI CBO Recruitment 2023 : ఎస్‌బీఐలో 5447 సీబీవో పోస్టుల భర్తీ.. తెలుగు రాష్ట్రల్లో 825 ఖాళీలు

ట్రెండింగ్ వార్తలు