Jio AirFiber : జియో ఎయిర్‌ఫైబర్ ధర, ప్లాన్లు ఇవే.. 115 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు.. మీ ప్రాంతంలో ఉందేమో చెక్ చేసుకోండి!

Jio AirFiber : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ భారత్‌లోని 115 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీసులో 1.5జీబీపీఎస్ స్పీడ్‌తో రెండు ప్లాన్లను అందిస్తోంది. ధర, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jio AirFiber now available in 115 Indian cities

Jio AirFiber : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అందించే సర్వీసుల్లో జియో ఎయిర్‌ఫైబర్ ఒకటి.. ఈ 5జీ ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్ ఇప్పుడు 115 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2023లో ప్రారంభమైన జియో ఎయిర్‌ఫైబర్ వైర్డు కనెక్షన్‌లను చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసు 1.5జీబీపీఎస్ వరకు వేగంతో అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ఎయిర్‌ఫైబర్ ఏయే నగరాల్లో ఉందంటే? :
రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 19, 2023న 8 నగరాలతో ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 115 నగరాలకు ఈ సర్వీసును విస్తరించిందని టెలికాం టాక్ నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉంది.

Read Also : JioMotive Location Tracker : జియోమోటివ్ రియల్ టైమ్ కారు లొకేషన్ ట్రాకర్ ఇదిగో.. ఎవరూ దొంగిలించలేరు.. ధర ఎంతంటే?

మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగ్‌పూర్, నాందేడ్, నాసిక్‌లలో అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో 2023 చివరిలోపు మరిన్ని నగరాలకు ఎయిర్ ఫైబర్ సర్వీసును విస్తరించాలని యోచిస్తోంది. మీ ప్రాంతంలో ఎయిర్ ఫైబర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి.

జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే? :

జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ అనే రెండు ప్లాన్ ఆప్షన్లలో అందిస్తుంది. ఈ సర్వీసు కోసం రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 12 నెలల ప్లాన్‌ని ఎంచుకునే వినియోగదారులకు ఈ రుసుము మినహాయింపు పొందవచ్చు.

Jio AirFiber 115 Indian cities

జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇవే :
* మూడు ప్లాన్‌ల ధర నెలకు రూ.599, రూ. 899 రూ.1199.
* ఇంటర్నెట్ స్పీడ్ 100ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.
* 550కి పైగా డిజిటల్ ఛానల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
* రూ.1199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియంకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు ఇవే :

రూ.1499, రూ. 2499, రూ. 3999 మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ స్పీడ్ 1జీబీపీఎస్ వరకు ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియంతో సహా 550కి పైగా డిజిటల్ ఛానల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉంది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు, జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులో పేరంట్ కంట్రోల్స్, వై-ఫై 6 సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్‌తో సహా ఎయిర్‌ఫైబర్ సర్వీసుతో అదనపు ఫీచర్లను కూడా అందిస్తుంది.

Jio AirFiber 

జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని ఎలా పొందాలంటే? :
మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి జియో వెబ్‌సైట్‌ను సందర్శించండి. మై జియో యాప్‌ని ఉపయోగించండి లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించండి.
– ఇలా బుకింగ్ ప్రాసెస్ ప్రారంభించండి.
* 60008-60008కి మిస్డ్ కాల్‌ని డయల్ చేయాలి.
* జియో వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం లేదా మై‌జియో యాప్‌ని ఉపయోగించాలి.
* మీ సమీప జియో స్టోర్‌ని సందర్శించాలి.
* జియో ఎయిర్‌ఫైబర్ కోసం రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన వివరాలను అందించండి.
* నిర్ధారణ కోసం వేచి ఉండండి. మీ భవనం లేదా ప్రదేశంలో సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది.
* మీ బుకింగ్ వెరిఫై చేసిన తర్వాత, వై-ఫై రూటర్, 4కె స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్, అవుట్‌డోర్ యూనిట్‌తో కూడిన జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ పొందవచ్చు.

Read Also : Jiophone Prima 4G Launch : జియోపే యూపీఐతో జియోఫోన్ ప్రైమా 4G ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు