Zika Virus : గర్భధారణ సమయంలో జికా వైరస్‌పై అవగాహన చాలా అవసరం : ఫెర్నాండెజ్ హాస్పిటల్

Zika Virus Infection : సాధారణంగా దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ అనేది ఆడ ఏడెస్ దోమ కాటుతో వ్యాపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది.

Awareness of Zika Virus Essential during Pregnancy ( Image Source : Google )

Zika Virus : ఇటీవల కాలంలో జికా వైరస్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్‌లోనూ జికా కేసులు చాలావరకూ నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికీ ఈ వైరస్ సంబంధిత హెచ్చరిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది.

Read Also : IT Employees Health Issues : డేంజర్‌లో టెకీలు.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం

ప్రధానంగా తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జికా వైరస్ అధిక ప్రభావితమైందని పేర్కొంది. జికా వైరస్ సోకిన వారిలో లక్షణాలను కనిపించడం లేదు. ఒకవేళ బయటపడితే జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎరుపు కళ్ళు (కండ్లకలక) వంటి లక్షణాలు ఉంటాయని తెలిపింది.

సాధారణంగా దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ అనేది ఆడ ఏడెస్ దోమ కాటుతో వ్యాపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ తల్లి పాలలోనూ ఉన్నట్టు అధ్యయనాల్లో తేలగా, తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డకు వైరస్ వ్యాప్తి అవుతుందని ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. జికా వైరస్ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.

ఈ జికా వైరస్‌ లక్షణాలు బయటపడిన 7 రోజులలోపు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే జికా వైరస్‌ నిర్ధారణ వీలు పడుతుంది. అంతేకాదు.. మూత్రం, లాలాజలం, అమ్నియోటిక్ ద్రవం లాంటి శరీర ద్రవాలలో కూడా వైరస్‌ను గుర్తించవచ్చు. గర్భధారణ సమయంలో జికా వైరస్ సంక్రమణతో శిశువులో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. పుట్టుకతో వచ్చిన జికా సిండ్రోమ్ (కాంజెనిటల్‌ జికా సిండ్రోమ్) అని కూడా పిలుస్తారు.

పాలిచ్చే తల్లుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మైక్రోసెఫాలీ అనేది చిన్నపాటి తల సైజులో ఉంటుంది. బ్రెయిన్‌ కాల్సిఫికేషన్‌లు, కండరాల స్థాయి పెరగడం, కంటి, వినికిడి సమస్యలతో అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. గర్భం దాల్చిన తొలి వారాల్లో జికా ఇన్ఫెక్షన్ సోకితే అత్యంత ప్రమాదం కూడా. జికా వైరస్ ఇన్ఫెక్షన్లతో 2016లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) కూడా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలను టెస్టింగ్ చేయడం, పాజిటివ్‌ వస్తే తల్లులలో పిండాల పెరుగుదలపై పర్యవేక్షించడం చేయాలని ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి ఆస్ప్రతులకు పలు సూచనలు చేశారు.

జికా వైరస్‌ను నివారణకు వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. దోమల కాటుకు గురికాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీల్లో వాటర్ కంటైనర్‌లను మూసి ఉంచాలని, సురక్షితమైన నీటిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

వ్యర్థాలను పారవేయడం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డాక్టర్ తారకేశ్వరి సూచించారు. దోమలు కుట్టకుండా ఉండేలా శరీరమంతా కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెర్మెత్రిన్ పూత కలిగిన నెట్ ఉపయోగించాలి. గర్భధారణ సమయంలో సురక్షితమైన డీట్ దోమల స్ప్రేరకాలను వినియోగించాలని ఆయన తగు జాగ్రత్తలు సూచించారు.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

ట్రెండింగ్ వార్తలు