గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

ఘటనా స్థలం నుండి 3 AK47, 2 INSAS, 1 కార్బైన్, 1 SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Gadchiroli Encounter : మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, జావాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలిలో జలశక్తి ఆపరేషన్ లో భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ సమీపంలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది.

వన్డోలి గ్రామంలోని చత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో 7 C60 జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు దాదాపు 7 గంటలకు పైగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. ఘటనా స్థలంలో 3 AK47, 2 INSAS, 1 కార్బైన్, 1 SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు లభించాయి.

ఈ ఎన్ కౌంటర్ లో తిపాగడ్ దళం ఇంచార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇతర మావోయిస్టుల గుర్తింపు కోసం సోదాలు కొనసాగుతున్నాయి. మావోలు జరిపిన కాల్పుల్లో సీ60కి చెందిన ఒక పీఎస్‌ఐ, ఒక జవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. జవాన్ల సక్సెస్ పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసల వర్షం కురిపించారు. మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన జల్ శక్తి ఆపరేషన్ విజయవంతం అవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. C60 కమాండోలు, గడ్చిరోలి పోలీసులకు రూ.51 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్.

Also Read : లైంగిక దాడి చేసి చంపేశారు- ముచ్చుమర్రి ఘటనపై సంచలన విషయాలు చెప్పిన నంద్యాల ఎస్పీ

ట్రెండింగ్ వార్తలు