Honda City Discounts : హోండా సిటీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఆఫర్.. వెంటనే కొనేసుకోండి!

హోండా కార్స్ ఇండియా 5వ జనరేషన్ హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 90వేల వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్‌లు డిసెంబర్ 2023లో హోండా అమేజ్‌పై రూ. 67వేల వరకు తగ్గింపులను పొందవచ్చు. ఈ తగ్గింపులు డిసెంబర్ 31, 2023 వరకు అందుబాటులో ఉంటాయని గమనించాలి.

Massive discounts of up to Rs 1 lakh of Honda City

Honda City Discounts : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. వచ్చే జనవరి 2024 నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. 2023 ఏడాదిలో డిసెంబర్ చివరి నెల కావడంతో కార్ల తయారీదారులు తమ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల కంపెనీలు తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించాయి. ఇప్పుడు హోండా కార్స్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 1 లక్ష వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది.

Read Also : New Kia Sonet facelift : డిసెంబర్ 14న కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

హోండా సిటీ ఇ:హెచ్ఈవీపై రూ.లక్ష డిస్కౌంట్ :
ఎక్స్చేంజ్ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌ల రూపంలో కస్టమర్‌లు ఈ ఆఫర్‌లను పొందవచ్చు. హోండా సిటీ మోడల్ సిటీ ఇ:హెచ్ఈవీపై రూ. 1 లక్ష వరకు, 5వ జనరేషన్ హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 90వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలో హోండా సిటీ ఇ:హెచ్ఈవీలో కస్టమర్లు రూ. లక్ష వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తగ్గింపులు రూ. 25వేల విలువైన క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 27వేల కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

Massive discounts of  Honda City

మరెన్నో విలువైన ఎక్స్ఛేంజ్, క్యాష్ డిస్కౌంట్లు :
అదనంగా, కస్టమర్లు 5 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ రూపంలో రూ. 23వేల తగ్గింపును పొందవచ్చు. హోండా అమేజ్ రూ. 67వేల వరకు తగ్గింపును పొందవచ్చు. కస్టమర్‌లు డిసెంబర్ 2023లో హోండా అమేజ్‌పై రూ. 67వేల వరకు తగ్గింపులను పొందవచ్చు.

ఈ తగ్గింపులు అనేవి రూ. 25వేల విలువైన క్యాష్ డిస్కౌంట్లు, రూ. 15వేలు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.200 విలువైన కార్పొరేట్ బోనస్/లాయల్టీ బోనస్ రూపంలో లభిస్తాయి. హోండా కార్స్ ఇండియా తమ కొత్త మోడళ్లలో జనవరి 2023 నుంచి ధరల పెంపును ప్రకటించింది. అయితే, డిసెంబర్ 2023 చివరి నాటికి పెంచే మొత్తాన్ని నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also : 5G Phones Launch : ఈ నెలాఖరులో లాంచ్ అయ్యే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు