Sardar 2 : ‘సర్దార్ 2’ సెట్‌లో ప్రమాదం.. ఒకరి మృతి..
తమిళ స్టారో హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది.
- Thota Vamshi Kumar
- Published On : July 17, 2024 / 04:21 PM IST
Accident in sardar 2 movie shooting Set
Sardar 2 : తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2 మూవీ షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగింది. స్టంట్ మ్యాన్ మరణించాడు. ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న స్టంట్‌మెన్ ఎజుమలై ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి పోయాడు. వెంటనే అప్రమత్తం అయిన మూవీ యూనిట్ ఆయన్ను ఆస్పత్రికి తరలించింది. అయితే.. చాలా ఎత్తు నుంచి పడడంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్రగాయమైంది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో హీరో కార్తి అక్కడే ఉన్నట్లు సమాచారం. స్టంట్‌మెన్ మృతితో మూవీ యూనిట్ షూటింగ్‌ను ఆపేసింది. అతడి కుటుంబానికి అండగా ఉంటామని హీరో కార్తీ తెలిపాడు.
Bharateeyudu 2 : ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చుగా.. భారతీయుడు 2ని కత్తిరించిన శంకర్.. అయినా కష్టమే..
కార్తీ హీరోగా 2022లో తెరకెక్కిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తి ద్విపాత్రాభినయంలో మెప్పించాడు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి ప్రారంభమైంది.
