New BMW 5 Series : ఎయిర్‌ కన్సోల్ గేమింగ్ ప్లాట్‌ఫారంతో కొత్త BMW 5 సిరీస్ కారు.. సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు!

New BMW 5 Series launch : సరికొత్త గేమింగ్ కారు వచ్చేస్తోంది.. ఎయిర్ కన్సోల్ గేమింగ్ ప్లాట్‌ఫారంతో కొత్త BMW 5 సిరీస్ కారు వచ్చేసింది.. ఈ కారులో ప్రత్యేకమైన యాప్ ద్వారా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు.

New BMW 5 Series launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ (BMW) గ్రూప్ కొత్త BMW 5 సిరీస్‌లో మొదటిసారిగా ప్రత్యేకమైన ఇన్-కార్ గేమింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ BMW 5 సిరీస్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ఎయిర్‌కాన్సోల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ కారు ఛార్జ్ అయ్యే వరకు వేచి ఉన్న సమయంలో డ్రైవర్, ప్రయాణీకులు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఉదాహరణకు.. కొత్త BMW 5 సిరీస్‌తో పాటు, ఇతర BMW వాహనాలలో AirConsole యాప్ అందుబాటులో ఉంది. ఈ కొత్త BMW 5 సిరీస్ లాంచ్ కోసం ప్రత్యేకంగా BMW గ్రూప్ ప్రత్యేకమైన గేమింగ్ లుక్‌తో BMW i5 డిజైన్ చేసింది. ఈ లివరీ BMW 5 సిరీస్ సెలూన్‌ని సాంకేతికంగా మాత్రమే కాదు.. విజువల్‌గా కూడా గేమింగ్ స్టేషన్‌గా మారుస్తుంది.

Read Also : Apple iPhone 12 : ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ఐఫోన్ 12 ఇక కనిపించదట.. ఎందుకో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోలర్‌గా పనిచేస్తుంది :
కారులో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం.. ఆటగాళ్లకు స్మార్ట్‌ఫోన్ అవసరం. ఈ యాప్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. BMW కర్వ్డ్ డిస్ప్లేతో కారులో AirConsole యాప్‌ను కలిగి ఉంది. కర్వ్‌డ్ డిస్‌ప్లేలో QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్, కారును కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆటగాళ్ళు నేరుగా కారులోనే గేమ్ ఆడుకోవచ్చు. AirConsole యాప్ మల్టీ ప్లేయర్‌లకు ఏకకాలంలో సపోర్టు ఇస్తుంది. కారు స్టాప్‌ చేసిన సమయంలో వెనుక ప్రయాణీకులు కూడా కారులో గేమింగ్ సరదాగా పాల్గొనవచ్చు.

New BMW 5 Series launch with AirConsole gaming platform

సాధారణంగా, ఒంటరిగా లేదా వాహనంలో ఉన్న వారందరితో కలిసి లేదా గేమ్ మోడ్‌లో ఆడుకోవచ్చు. ఎయిర్‌ కన్సోల్‌తో, ప్లేయర్‌లు క్యాజువల్ గేమ్‌లు ఆడవచ్చు. ఈ గేమ్‌లను కంట్రోల్ చేసేలా ఉంటాయి. కొత్త BMW 5 సిరీస్ సెలూన్ మార్కెట్లో రేసింగ్, స్పోర్ట్స్, క్విజ్, మ్యూజిక్ క్విజ్ గేమ్‌లతో పాటు సిమ్యులేషన్, స్ట్రాటజీ, జంప్-అండ్-రన్, పజిల్ గేమ్‌లు ఉన్నాయి. ప్రారంభం నుంచి ప్లే చేసేందుకు అందుబాటులో ఉన్న 15 లేదా అంతకంటే ఎక్కువ క్యాప్షన్లలో ‘గో కార్ట్ గో’, ‘గోలాజో’, ‘మ్యూజిక్ గెస్’ ’ఓవర్‌కక్డ్’ ఉన్నాయి.

స్పెషల్ గేమింగ్ లుక్‌తో BMW i5 :
ఇన్-కార్ గేమింగ్‌తో BMW గ్రూప్ ప్రత్యేకమైన గేమింగ్ ర్యాప్‌తో BMW i5ని అందిస్తోంది. ఈ కారు డిజైన్ పర్సనల్ పిక్సెల్‌ల వరకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పెద్ద పిక్సెల్‌లు కంప్యూటర్ గేమ్‌లతో ఇప్పుడు ఐకానిక్ 8-బిట్ యుగానికి నివాళిగా చెప్పవచ్చు. ఇందులోని కలర్ స్కీమ్ AirConsole ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న వివిధ గేమ్‌ల నుంచి ప్రేరణ పొందింది. వీడియో గేమ్ కంట్రోలర్‌ల ఎలిమెంట్స్ i5లో ఎయిర్‌కన్సోల్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. దాంతో మీ స్మార్ట్‌ఫోన్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. అన్ని గేమ్-ప్లే ఆప్షన్లను ఆటగాళ్ల చేతివేళ్లతోనే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.

Read Also : iPhone 15 Series : యూఎస్‌బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు