Team India new Jersey : కొత్త జెర్సీతో టీ20ప్రపంచకప్ బరిలోకి భారత్.. ఎలా ఉందో కాస్త చెప్పరూ?
భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 6, 2024 / 07:25 PM IST
screengrab from video posted on x by@adidas
భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం, భారత క్రికెట్ జట్టు అధికారిక కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్ సోమవారం సీనియర్ పురుషుల జట్టు కొత్త టీ20 జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు స్టేడియంలో కసరత్తులు చేస్తుండగా.. పక్క నుంచి హెలికాఫ్టర్ ఎగురుతూ వచ్చింది. హెలికాప్టర్‌కు తాడు కట్టి ఓ కొక్యానికి పెద్ద సైజులో ఉన్న భారత జెర్సీని తగిలించి ఉంది. దీన్ని చూసిన ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.
ICC Player of the Month award : ఏప్రిల్ నెలకు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల షార్ట్ లిస్ట్..
జెర్సీ నీలం, నారింజ రంగులను కలిగి ఉంది. భుజాలపై నారింజ రంగు ఉండగా, మిగిలిన భాగంలో నీలం ఉంది. భుజాలపై తెలుపు రంగు చారలు ఉన్నాయి. మొత్తంగా ఈ జెర్సీ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
కాగా.. రోహిత్ శర్మ సారథ్యంలో పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజ, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
Rohit Sharma : టాలెంట్‌కి పవర్‌హౌస్‌లాంటోడు.. రోహిత్ శర్మపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా..
రిజర్లు ఆటగాళ్లు: శుభమాన్ గిల్ , రింకూ సింగ్ , ఖలీల్ అహ్మద్ , అవేష్ ఖాన్
