OnePlus 12 Launch : ఈ నెల 5నే వన్‌ప్లస్ 12 ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ఒక్క రోజు ముందే కీలక ఫీచర్లు లీక్..!

OnePlus 12 Launch : డిసెంబర్ 5న వన్‌ప్లస్ 12 వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ఒక రోజు ముందు రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

OnePlus 12 battery key specs officially confirmed ahead of December 5 launch

OnePlus 12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. డిసెంబర్ 5న సాయంత్రం 4:30 గంటలకు వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక ఆవిష్కరణకు ఒక రోజు ముందు.. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ మరిన్ని స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది.

ఈ ఫోన్ చిప్‌సెట్, డిజైన్, కెమెరా, ఇతర వివరాలు ఇప్పటికే బయటపడ్డాయి. ఇప్పుడు, బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ వివరాలను కూడా కంపెనీ రివీల్ చేసింది. చైనాలో లాంచ్ చేసిన తర్వాత వన్‌ప్లస్ 12 జనవరి 2024లో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ వన్‌ప్లస్ 12 ధృవీకరించిన స్పెసిఫికేషన్‌లను ఓసారి లుక్కేయండి.

Read Also : 5G Phones Launch : ఈ నెలాఖరులో లాంచ్ అయ్యే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
వన్‌ప్లస్ 12 ఫోన్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. చాలా 2024 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కూడా చూడవచ్చు. ఈ డివైజ్ బాక్స్ వెలుపల సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వస్తుంది.ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌లో 2కే డిస్‌ప్లే కలిగి ఉంది. కచ్చితమైన డిస్‌ప్లే సైజు ఎంత అనేది తెలియదు. కానీ, 4,700నిట్‌ల గరిష్ట ప్రకాశానికి సపోర్టు ఇచ్చినందుకు ప్రకాశవంతమైన స్క్రీన్‌ను కలిగి ఉందని కంపెనీ ధృవీకరించింది. డిజైన్ వన్‌ప్లస్ 11 మాదిరిగానే కనిపిస్తుంది.

మొత్తం 3 కలర్ ఆప్షన్లలో :
అయితే, వన్‌ప్లస్ కాస్మెటిక్ మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ ఒక వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. రాబోయే వన్‌ప్లస్ ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లలో రానుంది. భారతీయ వెబ్‌సైట్‌లోని అధికారిక ఫొటోను పరిశీలిస్తే.. డివైజ్ మార్బుల్ బ్యాక్ ప్యానెల్ ఉందని, దానిపై గ్రీన్ పెయింట్ ఉందని సూచిస్తుంది. చైనాలో లాంచ్ చేసిన వీడియో టీజర్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ వైట్, బ్లాక్, గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇంకా, హుడ్ కింద 5,4000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

OnePlus 12 battery key specs December 5 launch

ఈ ఫోన్‌లో రెయిన్‌వాటర్ టచ్ టెక్నాలజీ :
వన్‌ప్లస్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇచ్చింది. గత వెర్షన్‌లో లేని 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 12 ఫీచర్ వర్షపు పరిస్థితుల్లో కూడా పనిచేయగల సామర్థ్యం ఉంటుంది. ​​ఈ ఫోన్‌ ఇంటర్నల్ ‘రెయిన్‌వాటర్ టచ్’ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫీచర్ మొదట వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో కూడా ప్రవేశపెట్టింది.

తడిగా ఉన్నప్పుడు కూడా టచ్ ఇన్‌పుట్‌ని కచ్చితంగా ప్రాసెస్ చేసేందుకు స్క్రీన్‌ను ఎనేబుల్ చేస్తుంది. ఆప్టిక్స్ పరంగా, రాబోయే వన్‌ప్లస్ ఫోన్ ఓపెన్ మాదిరిగానే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ వెనుకవైపు 48ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 64ఎంపీ టెలిఫోటో కెమెరాతో పాటు మరో సెన్సార్‌ను అందిస్తుంది.

Read Also : Honda City Discounts : హోండా సిటీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఆఫర్.. వెంటనే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు