OnePlus 12R First Sale : భారత్‌‌లో వన్‌ప్లస్ అభిమానుల కోసం ఫస్ట్ సేల్.. ఈ కొత్త ఫోన్‌పై మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

OnePlus 12R First Sale : భారత మార్కెట్లో ఫిబ్రవరి 6 నుంచి వన్‌ప్లస్ 12ఆర్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? ఏయే ఆఫర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

OnePlus 12R First Sale on February 6_ Check price in India

OnePlus 12R First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తమ ఫోన్లపై సేల్ ప్రకటించింది. అందులో ఇప్పటికే వన్‌ప్లస్ 12 విక్రయించగా.. మరో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ భారత మార్కెట్లో మొదటిసారిగా ఫిబ్రవరి 6న కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా, కంపెనీ కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా వెల్లడించింది.

Read Also : OnePlus Nord N30 SE 5G : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వన్‌ప్లస్ నార్డ్ N30 SE 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

వన్‌ప్లస్ 12ఆర్, ఒప్పో రెనో 11 ప్రో, పిక్సెల్ 7ఎ మరిన్నింటితో పోటీపడుతుంది. ఐక్యూ నియో 9 ప్రో భారత మార్కెట్లోకి కూడా వస్తోంది. కొత్త 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడుతుందని భావిస్తున్నారు. కొత్త వన్‌ప్లస్ 12ఆర్ భారత మార్కెట్లో ధర, సేల్ సమయం, లాంచ్ ఆఫర్‌లు, స్పెషిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం.

ఫిబ్రవరి 6న వన్‌ప్లస్ 12ఆర్ సేల్.. భారత్ ధర, సేల్ ఆఫర్లు :
వన్‌ప్లస్ 12ఆర్ బేస్ మోడల్ రూ. 39,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందిస్తుంది. 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో కూడిన మరో వేరియంట్ ధర రూ.45,999కు పొందవచ్చు. వన్‌ప్లస్ 12ఆర్ ఇండియా సేల్ ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

లాంచ్‌లో భాగంగా వన్‌ప్లస్ 12ఆర్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ హోల్డర్‌లపై రూ. 1,000 బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలుదారులు కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. 6 నెలల గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభ 24 గంటలలోపు ఆర్డర్‌ల కోసం వన్‌ప్లస్ రూ. 4,999 విలువైన బడ్స్ జెడ్2ని వన్‌‌ప్లస్ 12ఆర్‌తో ఉచితంగా అందిస్తోంది.

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు :
ఈ డివైజ్ 6.78-అంగుళాల అమోల్డ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను 1264 x 2780 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశం, 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120హెచ్‌‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ డివైజ్ అల్యూమినియం అల్లాయ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది.

OnePlus 12R First Sale on February 6_ Check price in India

హుడ్ కింద వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 12జీబీ లేదా 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆప్షన్లు అడ్రినో 740 జీపీయూ ద్వారా అందిస్తుంది. యూఎఫ్ఎస్ 4.0 టెక్నాలజీతో 1టీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఏస్ 3 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 లెన్స్, ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.2 లెన్స్‌తో కూడిన 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెన్సార్ ఉంది. ఈ డివైజ్ శక్తివంతంగా ఉండేందుకు 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో గణనీయమైన 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ ఏస్ 3 డాల్బీ అట్మోస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంది.

Read Also : Realme Valentines Day Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ఇదిగో.. ఏయే ఫోన్లపై భారీ డీల్స్ పొందొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు