Realme Valentines Day Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి ఫీచర్లతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పాపులర్ నార్జో సిరీస్‌పై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా 2024 వాలెంటైన్స్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు కొనసాగనుంది.
ఈ సేల్ సమయంలో నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్55పై కూపన్లు, బ్యాంక్ డీల్స్, మరిన్ని సేవింగ్స్ అందిస్తోంది. ఈ సేల్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు (Amazon.in, realme.com)లో అందుబాటులో ఉండనుంది. రియల్‌మి నార్జో సిరీస్‌లో రాబోయే డీల్‌ను వివరంగా పరిశీలిద్దాం.
రియల్‌మి నార్జో సిరీస్ ఆఫర్ వివరాలు :
రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ వేరియంట్, ప్రస్తుతం 12జీబీ+1టీబీ వేరియంట్ ధర రూ. 29,999, రూ. 2వేల అదనపు బ్యాంక్ ఆఫర్‌తో రూ. 27,999 తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ. 4వేల కూపన్ తగ్గింపు తర్వాత రూ. 27,999 విక్రయ ధర వద్ద అందుబాటులో ఉంది. అదే మోడల్ 8జీబీ +128జీబీ వేరియంట్ రూ. 23,999 ధరతో యూజర్లకు రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 21,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి నార్జో 60 కొనుగోలు చేసే వినియోగదారులు 8జీబీ +128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 17,999 నుంచి రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 2వేల ఆఫర్, రూ. 1,000 అదనపు బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. అదేవిధంగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 2,000 తగ్గింపుతో పాటు రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 16,999కు కొనుగోలు చేయొచ్చు.
రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ మోడల్‌లు ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ వాస్తవానికి రూ. 14,499 ఉండగా తగ్గింపు ధర రూ. 11,999కు పొందవచ్చు. అలాగే, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ. 10,999 ( అసలు ధర రూ.రూ. 12,999) రెండు బ్యాంకుల నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. రియల్‌మి నార్జో ఎన్55, ఎన్53 కొనుగోలుదారులు భారీ ధర తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.
రియల్‌మి నార్జో ఎన్55 మోడల్ 6జీబీ+128జీబీ వేరియంట్, అసలు ధర రూ. 12,999 ఉండగా.. రూ. 4వేలు తగ్గింపు తర్వాత కేవలం రూ. 8,999 విక్రయ ధరకు అందుబాటులో ఉంటుంది. 4జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లను కలిగిన నార్జో ఎన్53 మోడల్‌లు, ఆకర్షణీయమైన ధర ఆఫర్లు, కూపన్లతో వరుసగా రూ. 7,499, రూ. 9,499 విక్రయ ధరలలో అందుబాటులో ఉంటాయి.
రియల్‌మి నార్జో సిరీస్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 60 ప్రో :
రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ మోడల్ 12జీబీ+ 12జీబీ డైనమిక్ ర్యామ్, 1టీబీ రోమ్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ మార్టిన్ హారిజోన్పై ఆధారపడి ఉంటుంది. హుడ్ కింద 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 120హెచ్‌జెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 100ఎంపీ ఓఐఎస్ ప్రోలైట్ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ ఫోన్ మొత్తం మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
రియల్‌మి నార్జో 60 5జీ :
రియల్‌మి నార్జో 60 5జీ ఫోన్ వేగన్ లెదర్, మార్టిన్ హారిజోన్తో కూడిన డిజైన్‌తో పాటు 90హెచ్‌జెడ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే 20వేల-లెవల్ ఆటో బ్రైట్నెస్ ఎడ్జెట్ కలిగి ఉంది. 64ఎంపీ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కెమెరాలో 2ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, డీఐఎస్ స్నాప్‌షాట్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ ఉన్నాయి. నార్జో 60 5జీ డైమెన్సిటీ 6020 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 60 5జీ కూడా మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ :
ఈ 5జీ ఫోన్ పవర్ఫుల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, కళ్లు చెదిరే డిజైన్, స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్, సమర్థవంతమైన 5జీ చిప్సెట్, మల్టీ టాస్కింగ్ కోసం సింగిల్ మెగాపిక్సెల్ ర్యామ్, స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. 50ఎంపీ ఏఐ కెమెరాను కలిగి ఉంది. భారీ 5000ఎంఎహెచ్ బ్యాటరీతో 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సొల్యూషన్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 29 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
రియల్‌మి నార్జో ఎన్55 : ఈ స్మార్ట్‌ఫోన్ 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇది డివైజ్‌ను కేవలం 29 నిమిషాల్లో 50 శాతానికి ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఈ రియల్‌మి నార్జో ఎన్55 ఫోన్ కూడా 64ఎంపీ ఏఐ కెమెరాతో వస్తుంది.
రియల్‌మి నార్జో ఎన్53 ఫోన్ :
రియల్‌మి నార్జో ఎన్53 ఫోన్ అల్ట్రా-స్లిమ్ 7.49ఎమ్ఎమ్ బాడీ కలిగిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ ఉంది. కేవలం 31 నిమిషాల్లో డివైజ్‌ను 50 శాతానికి ఛార్జ్ చేస్తుంది. రియల్‌మి నార్జో ఎన్53లో 50ఎంపీ ఏఐ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, నైట్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, బోకె ఎఫెక్ట్ కంట్రోల్ వంటి అనేక రకాల ఫొటోగ్రఫీ ఫంక్షన్లు ఉన్నాయి. ఇతర ఆసక్తికరమైన ఫొటోగ్రఫీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ టీ612 చిప్సెట్తో పనిచేస్తుంది. రియల్‌మి నార్జో ఎన్53 ఫోన్ ఫెదర్ గోల్డ్ అండ్ ఫెదర్ బ్లాక్ రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.