Realme 12 Pro Plus 5G Launch : ట్రిపుల్ రియర్ కెమెరాలతో రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Realme 12 Pro Plus 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme 12 Pro Plus 5G With Snapdragon SoCs, 67W Fast Charging Debut in India

Realme 12 Pro Plus 5G Launch : రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ సోమవారం, జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి UI 5.0 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయి. రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్‌లో 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌‌మి 12 ప్రో ప్లస్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 ఎస్ఓసీలో రన్ అవుతుంది. అయితే, ఈ లైనప్‌లో సరసమైన ఆప్షన్ అయిన రియల్‌మి 12 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఉపయోగించని ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించడం ద్వారా అదనపు మెమరీ డైనమిక్ ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది.

Read Also : Realme 12 Pro Launch : రూ. 25,999 ధరకే రియల్‌మి 12 ప్రో 5G సిరీస్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

భారత్‌లో రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ధర :
రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ+ 256జీబీ మోడల్‌లో కూడా వస్తుంది. దీని ధర రూ. 31,999 ఉంటుంది. టాప్-ఆఫ్-లైన్ 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర రూ. 33,999కు పొందవచ్చు. నావిగేటర్ బీజ్, సబ్‌మెరైన్ బ్లూ, ఎక్స్‌ప్లోరర్ రెడ్ షేడ్స్‌లో వస్తుంది. రియల్‌మి 12 ప్రో 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 25,999కు కొనుగోలు చేయొచ్చు. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999కు సొంతం చేసుకోవచ్చు. నావిగేటర్ బీజ్, సబ్‌మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభ యాక్సెస్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ సిమ్ (నానో) రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ కంపెనీ రియల్‌మి యూఐ 5.0 స్కిన్‌తో పాటు ఆండ్రాయిడ్ 14ని రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్(1,080×2,400 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే పీ3 కలర్ 100 శాతం కవరేజీని కలిగి ఉంది. 240హెచ్‌జెడ్ టచ్ నమూనా రేటు, 800నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్క్రీన్ టీయూవీ రైన్‌ల్యాండ్ తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. అడ్రినో 710 జీపీయూ 12జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న మెమరీని 24జీబీ వరకు విస్తరించవచ్చు.

Realme 12 Pro Plus 5G  

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
రియల్‌మి కొత్త రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4 ఇన్ 1-పిక్సెల్ ఫ్యూజన్ టెక్నాలజీ, 1/1.56-తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 సెన్సార్ హెడ్‌లైన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. కెమెరా సెటప్‌లో ఓఐఎస్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ64బీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ముందు భాగంలో 32ఎంపీ కెమెరా ఉంది. కెమెరా సెటప్ 120ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.

సింగిల్ ఛార్జ్‌తో బ్యాటరీ గరిష్టంగా 390 గంటల స్టాండ్‌బై :
రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ 256జీబీ స్టోరేజీని అందిస్తుంది. ఈ ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన హై-రెస్ డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఐపీ65-సర్టిఫైడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. రియల్‌మి 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 48 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. సింగిల్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 390 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. 17.41 గంటల యూట్యూబ్ వీడియో ప్లేటైమ్‌ను అందించగలదని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 8.75ఎమ్ఎమ్ మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : iOS 18 Update : రాబోయే ఏఐ ఆధారిత iOS 18 ఆపిల్ చరిత్రలోనే అతిపెద్ద అప్‌డేట్ కావచ్చు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు