Paytm FASTag FAQs : పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. మార్చి 15 లోపు ఈ బ్యాంకులకు మారిపోండి.. లేదంటే అంతే సంగతులు!

Paytm FASTag FAQs : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తరచుగా అడిగే ప్రశ్నల (FAQs)కు సంబంధించి సమాధానాలను ఆర్బీఐ ప్రకటించింది.

Paytm FASTag holders advised to switch to other banks by March 15

Paytm FASTag FAQs : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించడంతో పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల్లో గందోరగోళం నెలకొంది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లావాదేవీల గడువును ఫిబ్రవరి 29 వరకు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఆ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ప్రకారం.. పేటీఎం బ్యాంకు అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఇందులో ఫ్యాస్ట్ ట్యాగ్, యూపీఐ, పేటీఎం, వ్యాలెట్, సేవింగ్, కరెంట్ అకౌంట్ వంటివి ఉన్నాయి.

Read Also : Paytm Crisis : పేటీఎం సంక్షోభం మధ్య ఫోన్‌పే, గూగుల్ పే, భీమ్ యాప్‌లకు ఫుల్ డిమాండ్.. 50శాతం పెరిగిన డౌన్‌లోడ్‌లు!

మరోవైపు.. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం అనేక సూచనలు చేసింది. ప్రత్యేకించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) మినహా 32 బ్యాంకుల నుంచి ఫాస్ట్ ట్యాగ్స్ పొందాలని సూచించింది. ఈ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్ ఉన్నాయి.

ఆర్బీఐ (FAQs) ప్రకారం.. 
ఫ్యాస్ట్ ట్యాగ్ అకౌంట్లలో తగినంత డబ్బు ఉన్నంత వరకు యూజర్లు టోల్‌లను చెల్లించడానికి ఫాస్ట్‌ట్యాగ్‌లను ఉపయోగించవచ్చని పేర్కొంది. మార్చి 15లోగా తమ పేటీఎం ఫ్యాస్ట్ ట్యాగ్ అకౌంట్లను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని పీపీబీఎల్ కస్టమర్లు, వ్యాపారులకు ఆర్బీఐ సూచించింది. అంతేకాదు.. డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా ఇతర కార్యకలాపాలను నిలిపివేసేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ మరో 15 రోజుల గడువు ఇచ్చింది. పీపీబీఎల్ కస్టమర్లు ఇతర యూజర్లకు తరచూ అడిగే ప్రశ్నలకు సంబంధించి జాబితాను రూపొందించింది.

పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్ల కోసం :

  • ప్రస్తుతం ఉన్న పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లు బ్యాలెన్స్ అయిపోయే వరకు టోల్‌లు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.
  • మార్చి 15, 2024 తర్వాత ఫండ్‌లను లేదా టాప్-అప్ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లను లోడ్ చేసే ఆప్షన్ ఉండదు.
  • మీ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లో డబ్బు ఉన్నంత వరకు అకౌంట్ ఉపయోగించవచ్చు.
  • మార్చి 15 తర్వాత ఎలాంటి టాప్-అప్‌లు లేదా నగదు జమ చేయడం అనుమతి ఉండదు.
  • టోల్ బూత్ వద్ద ఆలస్యం కాకుండా మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ తక్కువగా లేకుండా చూసుకోండి.
  • అంతరాయం లేకుండా టోల్ చెల్లింపులను చేసేందుకు మార్చి 15లోపు మరో బ్యాంక్ నుంచి కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కోసం అప్లయ్ చేసుకోండి.
  • మీ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ అనుగుణంగా మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.
  • మీరు పాత బ్యాలెన్స్‌ని వాడకుండా కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని పొందాలనుకుంటే.. మీ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌ని క్లోజ్ చేసి మిగిలిన మొత్తం రీఫండ్‌ చేసుకోవచ్చు.

ఈ పరిమితులు ప్రత్యేకంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసే ఫాస్ట్ ట్యాగ్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర బ్యాంకులు జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లు ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్త టాప్-అప్‌ల కోసం మార్చి 15, 2024 గడువు ఉంది. మరిన్ని వివరాల కోసం పేటీఎం వెబ్‌సైట్ లేదా ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని (FAQs) జాబితాను చెక్ చేసుకోండి.

Read Also : Paytm Pai Platforms : పేటీఎం పేరు మారిపోయిందిగా.. ఇకపై ఆ సర్వీసులన్నీ ఈ పేరుతోనే..!

ట్రెండింగ్ వార్తలు