Paytm Crisis : పేటీఎం సంక్షోభం మధ్య ఫోన్‌పే, గూగుల్ పే, భీమ్ యాప్‌లకు ఫుల్ డిమాండ్.. 50శాతం పెరిగిన డౌన్‌లోడ్‌లు!

Paytm Crisis : పేటీఎం సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ పేమెంట్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. పేటీఎం పోటీదారుల్లో PhonePe, BHIM, Google Pay యాప్ డౌన్‌లోడ్‌లు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది.

PhonePe, BHIM app downloads soar 20-50 Percent amid Paytm crisis

Paytm Crisis : ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వినియోగదారులు పేటీఎం ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, పేటీఎం ఇతర పోటీదారులైన PhonePe, BHIM, Google Pay యాప్ డౌన్‌లోడ్‌లు భారీగా (20 శాతం నుంచి 50 శాతం వరకు) పెరిగాయి. అంటే.. వినియోగదారులు పేటీఎం ప్రత్యామ్నాయ సర్వీసుల కోసం వెతుకుతున్నారనే సంకేతాలను అందిస్తోంది. ఇదే క్రమంలో ఫోన్‌పే ఫిబ్రవరి 3న 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లను పొందింది.

జనవరి 27న 1.92 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌ల నుంచి వారానికి 45 శాతం పెరుగుదల నమోదు చేసింది. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ డేటా ప్రకారం.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో వాల్‌మార్ట్-ఆధారిత డిజిటల్ చెల్లింపుల యాప్ ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లలో 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది, అంతకు ముందు వారంలో (జనవరి 24 నుంచి జనవరి 27) సంబంధిత కాలానికి 8.4 లక్షల డౌన్‌లోడ్‌లు జరిగాయి.

Read Also : OnePlus 12R Sale Today : వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు, ధర, బ్యాంకు ఆఫర్లు మీకోసం..

ఫ్రీ యాప్ విభాగంలో ఫోన్‌పే అగ్రస్థానం :
ఇటీవలి రోజుల్లో మరో డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే వినియోగదారులను, వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నంలో మార్కెటింగ్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీని ఫలితంగా భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో ఉచిత యాప్‌ల విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. వ్యాపార-కేంద్రీకృత యాప్ ఫోన్‌పే వ్యాపారం కూడా యాప్ ర్యాంకింగ్‌లలో గణనీయమైన పెరుగుదలను సాధించింది.

వ్యాపారులలో అప్లికేషన్ పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది. గూగుల్ ప్లేలో ఫోన్‌పే బిజినెస్ జనవరి 31న 188వ స్థానం నుంచి ఫిబ్రవరి 5న భారత మార్కెట్లో 33వ స్థానానికి చేరుకుంది. అయితే, యాప్ స్టోర్‌లో ఫోన్‌పే జనవరి 31న 227వ స్థానం నుంచి ఫిబ్రవరి 5న 72వ స్థానానికి చేరుకుంది.

దూసుకుపోయిన గూగుల్ పే, ఫోన్‌పే, భీమ్ యాప్ :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లను సాధించింది. అదేవిధంగా జనవరి 27న 1.11 లక్షల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌ల నుంచి వారానికి 21.5 శాతం పెరిగింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 నాలుగు రోజుల వ్యవధిలో భీమ్ యాప్ ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లలో 50 శాతం పెరిగి 5.93 లక్షలకు చేరుకుంది. అంతకు ముందు వారం (జనవరి 24 నుంచి జనవరి 27)లో సంబంధిత కాలానికి 3.97 లక్షల డౌన్‌లోడ్‌లు జరిగాయి. భీమ్ యాప్ 2024 జనవరి మధ్య నుంచి బలమైన వృద్ధిని సాధించింది.

యాప్ ర్యాంకింగ్స్‌లో భారీ పెరుగుదలను నమోదు చేసింది. భీమ్ యాప్ జనవరి 19న 326వ స్థానం నుంచి ఫిబ్రవరి 5 నాటికి భారత మార్కెట్లో గూగుల్ ప్లేలో 7వ స్థానానికి ఎగబాకింది. యాప్ స్టోర్‌లో భీమ్ యాప్ జనవరి 19న 171వ స్థానం నుంచి ఫిబ్రవరి 5న 40వ స్థానానికి చేరుకుంది. గూగుల్ పే ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్‌లలో మరింత పెరుగుదలను నమోదు చేసింది.

PhonePe, BHIM app downloads

ఫిబ్రవరి 3న కంపెనీ 1.09 లక్షల డౌన్‌లోడ్‌లను సాధించింది. జనవరి 27న 1.04 లక్షల డౌన్‌లోడ్‌ల నుంచి వారానికి 4.9 శాతం పెరిగింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో, గూగుల్ ఆధారిత డిజిటల్ పేమెంట్ల యాప్ ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లలో 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. అంతకు ముందు వారంలో (జనవరి 24 నుంచి జనవరి 27 వరకు) సంబంధిత కాలానికి 3.64 లక్షల డౌన్‌లోడ్‌లు జరిగాయి.

ఆర్బీఐ ఆంక్షలతో భారీగా క్షీణత :
ఫిబ్రవరి 29, 2024 నుంచి డిపాజిట్లు తీసుకోవడం, ఫాస్ట్‌ట్యాగ్, క్రెడిట్ లావాదేవీలతో సహా దాదాపు అన్ని ప్రధాన బ్యాంకింగ్ సర్వీసులను అందించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్‌లు ఫిబ్రవరి 3న 68,391కి క్షీణించాయి. అదేవిధంగా జనవరి 27న మొత్తం పేటీఎం యాప్ 90,039 డౌన్‌లోడ్‌ల నుంచి వారానికి 24 శాతం క్షీణత నమోదైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో, ఫిన్‌టెక్ మేజర్ దాదాపు 5 శాతం పెరిగింది. ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లు అంతకు ముందు వారంలో (జనవరి 24 నుంచి జనవరి 27 వరకు) 3.66 లక్షల డౌన్‌లోడ్‌ల నుంచి 3.48 లక్షలకు తగ్గాయి.

భారీగా క్షీణించిన పేటీఎం ర్యాంకింగ్స్ :
దీని వల్ల గత వారంలో పేటీఎం యాప్ ర్యాంకింగ్‌లు కూడా క్షీణించాయి. జనవరి 31న 18వ స్థానంలో ఉన్న పేటీఎం ప్రస్తుతం భారత మార్కెట్లో (Google Play Store)లో ఉచిత యాప్‌ల విభాగంలో 40వ స్థానంలో ఉంది. (App Store)లో పేటీఎం ర్యాంకింగ్ జనవరి 31న 15వ స్థానం నుంచి 27వ స్థానానికి దిగజారింది.

ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం యధావిధిగా :
పేటీఎం వినియోగదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా యాప్ ఫిబ్రవరి 29 తర్వాత యధావిధిగా పని చేస్తుందని స్పష్టం చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి పేటీఎం ప్రస్తుతం బ్యాంకింగ్ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని శర్మ చెప్పారు.

Read Also : Tech Companies Layoffs 2024 : టెక్ పరిశ్రమలో ఆగని ఉద్యోగాల కోతలు.. 2024లో ఏకంగా 32వేల మంది ఇంటికి.. ప్రధాన కారణాలివే..!

ట్రెండింగ్ వార్తలు