Reliance Jio Offers : రిలయన్స్ జియో అదిరే ఆఫర్.. ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లు ఈ ఓటీటీ కంటెంట్ ఫ్రీగా పొందొచ్చు..!

Reliance Jio Offers : జియో యూజర్లకు రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌తో సహా అనేక ఓటీటీ ఛానెల్‌లకు ఫ్రీ సభ్యత్వాలతో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను అందిస్తోంది.

Reliance Jio Offers : రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకించి ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిషేధించగా, అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ల ధరలను భారీగా పెంచింది.

Read Also : Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇప్పుడు, ఇష్టమైన ఓటీటీ కంటెంట్‌ను వీక్షించేందుకు వినియోగదారులు అధికంగా చెల్లించాలి. అయితే, మల్టీ సబ్‌స్క్రిప్షన్‌లపై భారీగా చెల్లించాల్సి ఉంటుంది. దాంతో జియో యూజర్లకు రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌తో సహా అనేక ఓటీటీ ఛానెల్‌లకు ఫ్రీ సభ్యత్వాలతో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను అందిస్తోంది. మీరు జియో ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్‌ని ఉపయోగిస్తుంటే.. ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగిన అన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు.

ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లతో జియో మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు :
జియో రూ. 398 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
రిలయన్స్ జియో రూ. 398 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులకు రోజుకు 2జీబీ చొప్పున 56జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. రోజువారీ లిమిట్ ద్వారా డేటా స్పీడ్ 64కేబీపీఎస్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్ కూడా ఉన్నాయి. సోనీ లైవ్, జీ5, లయన్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కన్‌చ్చా లంకా, ప్లానెట్ మారుతి, చాపల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, ఫ్యాన్ కోడ్, హోయిచాయితో సహా వివిధ రకాల స్ట్రీమింగ్ సర్వీసులను జియోటీవీ యాప్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లు ప్రయోజనం పొందుతారు. అదనంగా, యూజర్లు జియోసినిమా ప్రీమియంకు 28-రోజుల సభ్యత్వాన్ని అందుకుంటారు. కూపన్ వారి మైజియో అకౌంట్‌కు క్రెడిట్ పొందవచ్చు.

జియో రూ. 857 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
రిలయన్స్ జియో రూ. 857 ప్లాన్ రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 168జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజువారీ లిమిట్ చేరుకున్న తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉంటాయి. సబ్‌స్క్రయిబర్‌లు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు 84 రోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అలాగే జియోటీవీ, జియోసినిమా, జియక్లౌడ్ సర్వీసులకు యాక్సెస్‌ను కూడా అందుకుంటారు. అదనంగా, అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. అయితే, కాంప్లిమెంటరీ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియోసినిమా ప్రీమియం అందించదని గమనించాలి.

జియో రూ. 1099 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
జియో రూ. 1099 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 168జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉంటాయి. సబ్‌స్క్రైబర్‌లు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సర్వీసులకు యాక్సెస్‌తో బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. అయితే, కాంప్లిమెంటరీ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియోసినిమా ప్రీమియం ఉండదు.

రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
జియో రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 168జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత, స్పీడ్ 64కేబీపీఎస్‌కి పడిపోతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉంటాయి. సబ్‌స్క్రైబర్‌లు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ (3 నెలల పాటు), సోనీ లైవ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యుబే, ఎపిక్ ఆన్, సన్ ఎన్ఎక్స్‌టీ, హోయ్‌చాయ్, చౌపాల్, ప్లానెట్ మారుతి, కనచ్చాతో సహా స్ట్రీమింగ్ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్‌ల రేంజ్ అందుకుంటారు. ఫ్యాన్‌కోడ్, జియోటీవీ, జియోక్లౌడ్ అదనంగా, జియోసినిమా ప్రీమియమ్‌కు 84-రోజుల సభ్యత్వాన్ని అందిస్తుంది. కూపన్ మైజియో అకౌంట్లలో క్రెడిట్ పొందవచ్చు. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు అన్‌‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందవచ్చు.

రూ. 3227 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
రిలయన్స్ జియో రూ. 3227 ప్రీపెయిడ్ ప్లాన్ అనేది 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వార్షిక ప్యాకేజీ, రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 730జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉంటాయి. సబ్‌స్ర్కిప్షన్ జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలకు యాక్సెస్‌తో పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఒక ఏడాది సభ్యత్వాన్ని అందుకుంటారు. అదనంగా, అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. కాంప్లిమెంటరీ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియోసినిమా ప్రీమియం పొందవచ్చు.

Read Also : KTM Duke Bike Colours : కొత్త కలర్ ఆప్షన్లతో కేటీఎమ్ డ్యూక్ బైక్ వచ్చేసిందోచ్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు