KTM Duke Bike Colours : కొత్త కలర్ ఆప్షన్లతో కేటీఎమ్ డ్యూక్ బైక్ వచ్చేసిందోచ్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

కేటీఎమ్ 250 డ్యూక్ ధర రూ. 2,40,704 (ఎక్స్-షోరూమ్), కేటీఎమ్ 200 డ్యూక్ రూ. 1,98,317 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

KTM 250 Duke, KTM 200 Duke get new colours

KTM Duke Bike Colours : యువ రైడర్ల కోసం మూడు సరికొత్త కలర్ ఆప్షన్లతో కేటీఎం డ్యూక్ బైక్ వచ్చేసింది. కేటీఎమ్ 250 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ ప్రవేశపెట్టింది. కేటీఎం 250 డ్యూక్ ఇప్పుడు కొత్త అట్లాంటిక్ బ్లూ కలర్‌ను పొందగా, 200 డ్యూక్ వేరింట్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వనో అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కేటీఎమ్ 250 డ్యూక్ ధర రూ. 2,40,704 (ఎక్స్-షోరూమ్), కేటీఎమ్ 200 డ్యూక్ రూ. 1,98,317 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

Read Also : TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

కేటీఎమ్ 250 డ్యూక్ 249.07సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 31పీఎస్ శక్తిని, 25ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీపీ సస్పెన్షన్ ప్యాకేజీతో కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు, స్విచ్ చేయగల ఏబీఎస్ క్విక్‌షిఫ్టర్ ప్లస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కేటీఎం 200 డ్యూక్ 199.5సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డీఓహెచ్‌సీ, ఇఎఫ్ఐ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 25పీఎస్ గరిష్ట శక్తిని 19.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మోటార్‌సైకిల్‌లో అన్ని-ఎల్ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్విచ్ ఏబీఎస్, వీపీ యూఎస్‌డీ, మోనోషాక్, అల్యూమినియం స్వింగార్మ్‌తో కూడిన తేలికపాటి ట్రేల్లిస్ ఫ్రేమ్ ఉన్నాయి. కేటీఎమ్ డ్యూక్ ఇంజినీరింగ్ రైడర్ల అవసరాలకు తగినట్టుగా రూపొందించింది. రెడీ టు రేస్ ఎథోస్‌తో డిజైన్ అయింది. యువ రైడర్లను ఆకర్షించేందుకు అత్యంత శక్తి, రేజర్-షార్ప్ కంట్రోల్ రూపకల్పనతో కూడిన కొత్త జనరేషన్ మల్టీ ఆప్షన్లతో కొత్త కలర్ వేరియంట్‌లను కలిగి ఉందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబికింగ్) సుమీత్ నారంగ్ అన్నారు.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?