ICMR VCRC Recruitment : ఐసీఎంఆర్‌ వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌ లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి హైస్కూల్‌ విద్యార్హతలు, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 28 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ICMR VCRC Recruitment : పుదుచ్చేరిలోని భార‌త ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌ వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌ (ఐసీఎమ్ఆర్-వీసీఆర్)లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-బి) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి హైస్కూల్‌ విద్యార్హతలు, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 28 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచినవారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.18,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ICMR-VECTOR కంట్రోల్ రీసెర్చ్ సెంటర్, మెడికల్ కాంప్లెక్స్, ఇందిరా నగర్, పుదుచ్చేరి – 605 006. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://vcrc.icmr.org.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు