నరేంద్ర మోదీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది: కోదండరాం

మోదీ పాలనలో పేద, ధనికుల వ్యత్యాసం పెరిగింది. రైతులు మోదీపై పోరాటం చేయడంతో నల్ల చట్టాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. 

Professor Kodandaram: కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఓడిపోతుందని తెలంగాణ జనసమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో ధరలు రెట్టింపు అయ్యాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయన్నారు. ధరలు పెరగడంతో వ్యవసాయం‌ చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు.

లక్షా 50 వేల మంది కార్మికులు సింగరేణిలో పని చేస్తే.. ఇప్పుడు 50 వేల మందికి కార్మికులు తగ్గిపోయారని వెల్లడించారు. సైన్యంలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. బొగ్గు గనులును సైతం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. సింగరేణి ప్రస్థానం ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

”ఎన్నికల్లో ఎలక్టోరల్ బాండ్లతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. 162 మంది బిలియనీర్ల వద్ద కోట్ల రూపాయల ఆదాయం ఉంది. మోదీ పాలనలో పేద, ధనికుల వ్యత్యాసం పెరిగింది. రైతులు మోదీపై పోరాటం చేయడంతో నల్ల చట్టాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. మతం పేరుతో పక్కదారులు. రాజ్యాంగం మార్చాలని మోదీ ప్రభుత్వం పూనుకుంద”ని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Also Read: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, నేను బతికుండగా అలా జరగనివ్వను- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు