Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ రాకపై కీలక ప్రకటన చేయనున్న నాసా!

Sunita Williams : సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అనేదానిపై స్సష్టత లేదు. ప్రస్తుతం సేకరించిన డేటాను సమీక్షిస్తున్నామని, నాసా, బోయింగ్ తెలిపాయి. త్వరలో కీలక ప్రకటన విడుదల చేయనున్నాయి.

Sunita Williams's return from space

Sunita Williams : బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టిన ఇద్దరు వ్యోమగాములు అక్కడే ఉండిపోయారు. వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్‌ ఐఎస్ఎస్‌లో చిక్కుకున్నారు. దాంతో వారిద్దరూ అంతరిక్షం నుంచి భూమిపైకి రావడం ఆలస్యమవుతుందని ఇప్పటికే నాసా వెల్లడించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయోగించిన తర్వాత ఇద్దరు వ్యోమగాములు జూన్ 6 నుంచి ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు.

Read Also : Sunita Williams : సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు!

వ్యోమనౌక థ్రస్టర్‌లో సాంకేతిక సమస్యతో వ్యోమగాములు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే, నాసా, బోయింగ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రాకపై కీలక ప్రకటన చేయనున్నాయి. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌గా పిలిచే ఈ మిషన్.. వ్యోమగాముల రాక ఆలస్యం కారణంగా అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది.

టెస్టింగ్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ బృందాలు :
ఇటీవలే, నాసా, బోయింగ్‌కు చెందిన ఇంజనీరింగ్ బృందాలు న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ టెస్ట్ ఫెసిలిటీలో స్టార్‌లైనర్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్ గ్రౌండ్ హాట్ ఫైర్ టెస్టింగ్‌ను పూర్తి చేశాయి. విలియమ్స్, విల్మోర్‌లు భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి ఈ టెస్ట్ సిరీస్ కీలకంగా చెప్పవచ్చు. ఈ టెస్టింగ్ నుంచి సేకరించిన డేటాను ప్రస్తుతం నాసా విశ్లేషిస్తోంది. రాబోయే ప్రకటనలో ప్రాథమిక ఫలితాలను చర్చించాలని నాసా భావిస్తోంది.

ఐఎస్ఎస్‌కి వచ్చినప్పటి నుంచి విలియమ్స్, విల్మోర్‌లు ఎక్స్‌పెడిషన్ 71 సిబ్బందితో ఏకీకృతమై, శాస్త్రీయ పరిశోధనలు, అనేక ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మిషన్ స్టార్‌లైనర్ సిస్టమ్ ఎండ్-టు-ఎండ్ టెస్ట్‌గా పనిచేస్తుంది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం, వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడం, అమెరికన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో భాగస్వామ్యం ద్వారా ఐఎస్ఎస్ యాక్సస్ విస్తరించడమే దిశగా నాసా ప్రయత్నాలు చేస్తోంది. తద్వారాడ   శాస్త్రీయ పరిశోధన, కమర్షియల్ వెంచర్లు, అంతరిక్షంలో మానవ అన్వేషణ కోసం మరిన్ని అవకాశాలను తెరవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ కేవలం 7 రోజులు మాత్రమే ఉండేలా షెడ్యూల్ చేసింది.

భూమికి తిరిగి ఎప్పుడు వస్తారంటే? :
సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అనేదానిపై స్సష్టత లేదు. ప్రస్తుతం సేకరించిన డేటాను సమీక్షిస్తున్నామని, నాసా, బోయింగ్ తెలిపాయి. రాబోయే వారాల్లో ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరుగు పయనం అవుతారని నాసా, బోయింగ్ తెలిపాయి.

స్టార్‌లైనర్ థ్రస్టర్‌ సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు వ్యోమగాములు అక్కడే ఉండాల్సి వస్తుంది. మరో వారం పాటు ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే గడపబోతున్నారు. అందిన నివేదిక ప్రకారం.. వచ్చే ఆగస్టులోగా స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read Also : NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

ట్రెండింగ్ వార్తలు