స్టార్ హోటల్‌గా మార్చేస్తారా, ఏ కంపెనీకైనా లీజుకి ఇస్తారా.. రుషికొండ ప్యాలెస్‌ను సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Rushikonda Palace : విశాఖ రుషికొండ ప్యాలెస్.. ఈ అద్భుత కట్టడం ఇప్పుడు ఏ కార్యాలయంగా మారబోతోంది? ఏ శాఖకు కేటాయించబోతున్నారు? స్టార్ హోటల్ గా మార్చేస్తారా? ఏ కంపెనీకైనా లీజుకి ఇచ్చేస్తారా? అసలు రుషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ పై అసెంబ్లీలోనూ ఆసక్తికర చర్చ జరిగింది. రుషికొండ భవనాలను ఏం చేయాలో సలహా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. టూరిజం శాఖకు అప్పగించాలని కొందరు సలహా ఇచ్చారు. తమ శాఖకు కేటాయించాలని అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో ఏదైనా స్టార్ హోటల్ పెడదామని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సలహా ఇచ్చారు. అయితే, ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

గత ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్లతో నిర్మించిన రుషికొండ భవనాలను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రుషికొండ ప్యాలెస్ భవనాల వ్యవహారం అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చింది. ఈ భవనాలను ఏం చేయాలి? అని స్వయాన సీఎం చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. రుషికొండ ప్యాలెస్ భవనాలను టూరిజం ప్రాజెక్ట్ కు ఇవ్వాలని ప్రతిపాదించారు. విశాఖపట్నం.. సిటీ ఆఫ్ డెస్టినీగా అవతరిస్తున్న నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించి ఆ భవనాలను వాటికి ఇస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

కొన్ని భవనాలను ప్రభుత్వమే వినియోగించుకుని, మరికొన్ని భవనాలను సినీ లేదా ఐటీ పరిశ్రమకు ఇవ్వాలని ప్రతిపాదించారు. సెవెన్ స్టార్ లేదా నైన్ స్టార్ హోటల్ గా మార్చాలని మరికొందరు ప్రతిపాదించారు. ఫలక్ నుమా మాదిరిగా రుషికొండ ప్యాలెస్ భవనాలను టాటా గ్రూప్ కు ఇచ్చేద్దామనే ప్రతిపాదన సైతం వచ్చింది. అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుషికొండ ప్యాలెస్ భవనాలను ఏం చేయాలి? అనే దానిపై ఒక అధ్యయనం కూడా చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ తర్వాత రుషికొండకు వెళ్దామని ఎమ్మెల్యేలతో చంద్రబాబు అన్నారు.

Also Read : టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?

ట్రెండింగ్ వార్తలు