Type 2 Diabetes Risk : ఉదయం 8.30కు ముందే బ్రేక్ ఫాస్ట్ తినేయండి.. టైప్-2 డయాబెటిస్ ముప్పు పూర్తిగా తగ్గిపోతుంది!

టైప్ -2 డయాబెటిస్ వ్యాధితో జాగ్రత్త.. ముందుగానే జాగ్త్రత్త పడకపోతే ఈ టైప్ -2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుంది జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..

Type 2 Diabetes Risk : టైప్ -2 డయాబెటిస్ వ్యాధితో తస్మాత్ జాగ్రత్త.. చాపకింద నీరులా వ్యాపించే ఈ వ్యాధి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. ముందుగానే జాగ్త్రత్త పడకపోతే ఈ టైప్ -2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుంది జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ ముప్పును తప్పించుకోవాలంటే.. ముందు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలంట.. ఆహారాన్ని తీసుకోనే సమయం కూడా చాలా ముఖ్యమంటోంది కొత్త అధ్యయనం. రోజులో మొదటగా తీసుకునే ఆహారంతోనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తేలింది.

ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు ముందే బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు పూర్తిగా తగ్గిందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. గ్లూకోజును నియంత్రించడంలో ఎప్పుడైతే ఇన్సూలిన్ పనిచేయడం మానేస్తుందో అప్పుడే రక్తంలో షుగర్ స్థాయిలు పెరగడం లేదా తగ్గడం గానీ జరుగుతాయి. శరీరానికి అవసరమైన ఇందనాన్ని అందించలేకపోతుంది. తద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అది క్రమంగా కళ్లు, గుండె, కాళ్ల పాదాలను దెబ్బతీస్తుంది.

ఎవరైతే ఉదయం తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారో వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చర్లు.. అమెరికాలోని 10,574 మంది డైటింగ్ డేటాపై అధ్యయనం చేశారు. ఇందులో పాల్గొన్నవారిని ఆరు గ్రూపులుగా విభజించారు. రోజు వారు ఆహారం తీసుకునే సమయం ఆధారంగా డేటాను విశ్లేషించారు. వారిలో రోజుకు 10గంటల కంటే తక్కువ నుంచి.. 10గంటల నుంచి 13 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని నిర్ధారించారు.

వీరంతా ఉదయం 8.30గంట తర్వాత మాత్రమే బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నట్టు గుర్తించారు. ఒకో గ్రూపులో ఎవరూ ఏ సమయంలో ఫుడ్ తీసుకుంటున్నారో పోల్చి చూశారు. వారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తో పాటు ఇన్సూలిన్ స్థాయి ఎలా ఉందో పరీక్షించారు.ఈ గ్రూపుల మధ్య ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఎలాంటి తేడా లేదని తేలింది. రోజుంతా తక్కువ వ్యవధిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నవారితో పోలిస్తే.. మిగతా అన్ని గ్రూపులలో వారిలో ఇన్సలిన్ నిరోధకత అత్యధికంగా ఉన్నాయని గుర్తించారు. మెటాబాలిక్ డిజార్డర్ వంటి సమస్యలు మనం తీసుకునే ఆహారం సమయంతో సంబంధం ఉంటుందని అధ్యయనంలో రుజువైంది.

ట్రెండింగ్ వార్తలు