Uric Acid Levels : యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లో చేసిన ఈ జ్యూస్‌లతో తొందరగా తగ్గించుకోవచ్చు!

Uric Acid Levels : శరీరంలో యూరిస్ యాసిడ్ స్థాయిలను అదుపులో లేకుంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సహజమైన పద్ధతిలో ఈ సమస్యను తగ్గించుకోవడానికి అద్భుతమైన హోం మేడ్ జ్యూస్‌లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Uric Acid Levels : మీరు తరచుగా ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు లేదా కండరాల తిమ్మిరితో బాధపడుతున్నారా? ఈ విషయాలన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి సూచికగా గమనించాలి. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయగలదో ఇప్పుడు తెలుసుకుందాం…

యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఆరోగ్యానికి హానికరమా?
ఆధునిక జీవితంలో చెడు ఆహారపు అలవాట్లు లేదా అధిక ఒత్తిడితో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. చివరికి మూత్రపిండాలు, గుండె, కాలేయ పనితీరుపై ప్రభావితం చేస్తుంది. శరీరం, కండరాలలో నొప్పిని పెంచుతుంది. కీళ్ల నొప్పులకు, ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తప్రవాహంలో చాలా యూరిక్ యాసిడ్ హైపర్‌యూరిసెమియా వంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

మూత్రపిండాల్లో రాళ్లను పెరిగేలా చేస్తుంది. ఆర్థరైటిస్, గౌట్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల, శరీరాన్ని సహజంగా నయం చేయడానికి ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేయడానికి ఆహారంలో మార్పులు చేయడం చేయడం ద్వారా నివారించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహజంగా సాయపడే కొన్ని సాధారణ ఇంట్లో తయారుచేసిన పానీయాలు, జ్యూస్‌లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే?

అల్లం టీ :
ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అల్లంలోని క్రిమినాశక, శోథ నిరోధక గుణాలు ఉండటమే కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సహజంగా మంట, కీళ్ల నొప్పులు, శరీర నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.

దోసకాయ రసం :
దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు శుద్ధి అవుతాయి. రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం, భాస్వరం ఉండటం వల్ల మూత్రపిండాలను క్లీన్ చేయడంలో సాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును పెంచడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

క్యారెట్ రసం :
తాజా క్యారెట్ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఎందుకంటే.. క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫైబర్, బీటా కెరోటిన్, మినరల్స్ ఉన్నాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సాయపడతాయి. దీనికి నిమ్మరసం కలపడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సహజంగా రోగనిరోధక శక్తిని, కణాల పునరుత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది.

గ్రీన్ టీ :
ఈ సాధారణ టీని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. అదే సమయంలో టీలోని యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని రోజుల్లో సహజంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సాయపడతాయి.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు