DDD Benefits: డీడీడీ ఎఫెక్ట్.. అద్భుతమైన ఆరోగ్యం.. రోగాలు మాయం.. మీరు కూడా ట్రై చేయండి

DDD Benefits: డిజిటల్ డిటాక్సింగ్ డైట్ అనేది ఆహార సంబంధిత డైట్ కాదు, ఇది మన డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించే విధానాన్ని సూచిస్తుంది.

DDD Benefits: డీడీడీ ఎఫెక్ట్.. అద్భుతమైన ఆరోగ్యం.. రోగాలు మాయం.. మీరు కూడా ట్రై చేయండి

Health benefits of a digital detox diet

Updated On : August 12, 2025 / 6:03 PM IST

ఈ డిజిటల్ యుగంలో మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్లు, టీవీలు మన జీవితంలో భాగంగా మారిపోయింది. ఇవి లేకుండా ఒకరోజు గడవడం కష్టంగా మారిపోయింది. అయితే, అధికంగా ఈ సాంకేతిక సాధనాలను వాడటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే నేపథ్యంలో “డిజిటల్ డిటాక్సింగ్ డైట్” అనే ఆలోచన పుట్టింది. ఈ మధ్య కాలంలో చాలా మంది నిపుణులు సైతం DDDని సూచిస్తున్నారు. కాబట్టి, అసలు ఈ డిజిటల్ డిటాక్సింగ్ డైట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అవసరం, ఇది ఎలా చేయాలో, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

డిజిటల్ డిటాక్సింగ్ డైట్ అంటే ఏమిటి?

డిజిటల్ డిటాక్సింగ్ డైట్ అనేది ఆహార సంబంధిత డైట్ కాదు, ఇది మన డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించే విధానాన్ని సూచిస్తుంది. ఈ విధానం మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ, టాబ్లెట్ వంటి స్క్రీన్ ఆధారిత పరికరాల వినియోగాన్ని నియంత్రించడంలో లేదా తాత్కాలికంగా మానేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడటం జరుగుతుంది.

ఎందుకు డిజిటల్ డిటాక్స్ అనేది అవసరం?

ప్రస్తుత కాలంలో సగటున ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 9 గంటలు స్క్రీన్‌ ముందు గడుపుతున్నాడు. చాలా మంది ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో నిద్రలేమి, ఒత్తిడి, దృష్టి సమస్యలు, అలసట వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి, డిజిటల్ డీటాక్స్ అనేది అవసరం.

డిజిటల్ డిటాక్సింగ్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు:

1.మెరుగైన మానసిక ఆరోగ్యం:
స్క్రీన్ టైమ్ తగ్గించటం వలన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. సోషల్ మీడియా వల్ల వచ్చే “comparison anxiety” తగ్గిపోతుంది.

2.నిద్ర నాణ్యత మెరుగవుతుంది:
స్క్రీన్ వెలుతురు మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. డిటాక్స్ వల్ల నిద్ర వేళల్లో స్థిరత్వం వస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

3.దృష్టి సమస్యలు తగ్గుతాయి:
డిజిటల్ ఐ స్ట్రైన్, తలనొప్పులు తగ్గుతాయి. కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

4.మనస్సు నిలకడగా ఉంటుంది:
ఎక్కువ టైమ్ స్క్రీన్ ముందు గడపడం వల్ల మానసిక అలసట వస్తుంది. డిటాక్సింగ్ మనిషికి శాంతి, స్థితప్రజ్ఞను ఇస్తుంది.

5.వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి:
డిజిటల్ డిటాక్స్ డైట్ వల్ల కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి.

డిజిటల్ డిటాక్స్ ఎలా చేయాలి?

  • ఉదయం 7 నుంచి 9 వరకు, రాత్రి 8 తరువాత మొబైల్ కూడా దూరంగా ఉండండి.
  • ఫోన్‌ను “Do Not Disturb” మోడ్ పెట్టేయండి
  • కనీసం నిద్రకి 1 గంట ముందు స్క్రీన్ దూరంగా ఉంచాలి
  • వారానికి ఒక రోజు ఫోన్ లేని రోజుగా పాటించండి
  • పుస్తకాలు చదవడం, నడక, మ్యూజిక్ వినడం, గార్డెనింగ్ లాంటివి అలవాటు చేసుకోండి
  • కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయండి

డిజిటల్ డిటాక్సింగ్ అంటే పరికరాలను శాశ్వతంగా వదలేయడం కాదు.. తాత్కాలిక విరామం తీసుకుని మన నిజ జీవితానికి తిరిగి కనెక్ట్ అవడం. ఇది మానసిక స్పష్టత, ఆరోగ్యం, ఆనందానికి మార్గం చూపుతుంది.