Health Tips: ఉదయం లేవగానే వీటిని చుడండి.. నెగిటివ్ ఫీలింగ్ పోతుంది.. మైండ్ రిలీఫ్ గా, మనసు ప్రశాంతంగా మారుతుంది

Health Tips: ఉదయపు సూర్యకాంతి మన శరీరంలో విటమిన్ D అందించడమే కాక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Health Tips: ఉదయం లేవగానే వీటిని చుడండి.. నెగిటివ్ ఫీలింగ్ పోతుంది.. మైండ్ రిలీఫ్ గా, మనసు ప్రశాంతంగా మారుతుంది

5 things that will calm your mind in the morning

Updated On : August 12, 2025 / 6:32 PM IST

ప్రస్తుతం కాలంలో చాలా మందిలో నెగటివ్ ఫీలింగ్స్ చాలా పెరిగిపోయాయి. దీనివల్ల నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, ఇలాంటి మైండ్ కి రిలీఫ్ కావాలంటే అది మనం ఉదయం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే మనస్సులో వచ్చే భావాలు, ఆలోచనలు, శారీరక అనుభూతులు, ఇవన్నీ మన పనితీరు, మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి ఉదయం నెగటివ్ విషయాలకన్నా, సానుకూలత నింపే దృశ్యాలను చూసే అలవాటు పెట్టుకుంటే, మన జీవితం అంతా మారుతుంది. కాబట్టి అలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ వివరంగా తెల్సుకుందాం.

1. సూర్యోదయం,ఉదయపు వెలుగు:
ఉదయపు సూర్యకాంతి మన శరీరంలో విటమిన్ D అందించడమే కాక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది సెరోటొనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసి మూడ్‌ను పెంపొందిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, శక్తి, రోజు మొత్తం ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. బలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది.

2.ఆకుపచ్చ చెట్లు, ప్రకృతి దృశ్యం:
ప్రకృతి దృశ్యాలు చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆకుపచ్చ వాతావరణం ఒత్తిడిని తగ్గించి, మెదడును శాంతంగా ఉంచుతుంది. అలాగే గుండె నిలకడగా ఉండేలా చేస్తుంది.

3.భక్తి చిహ్నాలు, దేవుడి దర్శనం:
ఉందయం లేడగానే దేవుడిని చూడటం లేదా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, భద్రత భావన కలుగుతుంది. మనసు స్థిరంగా మారుతుంది, కొత్త రోజును నెగటివ్ ఆలోచనలతో కాకుండా పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభమవుతుంది.

4.లక్ష్యాల జాబితా, ప్రేరణా వాక్యాలు:
మీ గోల్స్ చూసినప్పుడు మీ మైండ్ ఫోకస్ లోకి వస్తుంది. ప్రేరణా వాక్యాలు రోజును ఆత్మవిశ్వాసంతో ప్రారంభించడానికి సహాయపడతాయి. వీటి వల్ల అలసట తగ్గిపోతుంది. రోజును కొత్తగా ప్రారంభించడానికి ఉత్సాహం వస్తుంది.

5.మీ కుటుంబ సభ్యులు, ఇష్టమైన వ్యక్తులు:
కుటుంబ సభ్యుల ముఖాలు చూసినప్పుడు మన హృదయంలో ప్రేమ, శాంతి అనుభూతి కలుగుతుంది. మనసు హాయిగా మారి ఒత్తిడికి దూరం అవుతుంది.

ప్రతి ఉదయం మైండ్‌ఫుల్‌గా లేవండి, పాజిటివ్‌దృష్టితో చూసే దృశ్యాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక చిన్న మార్పే, జీవితం మొత్తాన్ని మార్చగలదు.