Diabetes With French Fries: మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమా.. అయితే వెంటనే మానేయండి.. ఎందుకో తెలుసా?
Diabetes With French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ చేయబడతాయి. ఇందుకోసం రీయూజ్ చేసిన ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

Health problems caused by eating French fries
ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ మాట వినగానే చాలా మందికి నోట్లో నీరు రావడం ఖాయం. చిన్నవారైనా, పెద్దవారైనా ఈ వేడివేడి, క్రిస్పీ ఆలుగడ్డ వేపుడు ఐటెంని చాలా ఇష్టంగా తింటారు. బర్గర్‌తో, చికెన్‌తో, ఏదైనా స్నాక్స్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ఆధునిక జీవనశైలిలో భాగమైపోయింది. ఎక్కడివరకు బాగానే ఉంది. కానీ, తరుచుగా వీటిని తినడం వల్ల అనేకరకాల ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ సమస్యలు ఏంటో అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
1.అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు:
ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ చేయబడతాయి. ఇందుకోసం రీయూజ్ చేసిన ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్స్ ను ఏర్పరుస్తుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగి, మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.
2.బరువు పెరుగుదల:
ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఆలుగడ్డలతో తయారుచేస్తారు కాబట్టి ఇందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మనం తరుచుగా తినే చిన్న బాక్సులోనే కనీసం 300 నుంచి 400 క్యాలరీలు ఉండొచ్చు.
3.టైప్ 2 డయాబెటిస్:
ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచుతుంది. అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్లు కలయిక వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. దీన్ని తరచూ తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశమును ఉంది.
4.అక్రిలామైడ్, క్యాన్సర్ ప్రమాదం
ఆలుగడ్డలను అధిక వేడి వద్ద వేయించినప్పుడు అక్రిలామైడ్ అనే రసాయనం విడుదలవుతుంది. కొన్ని శోధనల ప్రకారం ఈ క్యాన్సర్ కారకంగా మారవచ్చు.
5.హై బ్లడ్ ప్రెజర్:
ఫ్రెంచ్ ఫ్రైస్ పై వేసే అధిక ఉప్పు (సోడియం) వల్ల బీపీ పెరగడం జరుగుతుంది. ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపించి అనేక సమస్యలకు, కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది.
6.జీర్ణక్రియ సమస్యలు:
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, యాసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంత మందిలో ఇది IBS (Irritable Bowel Syndrome) లాంటి సమస్యలను ప్రారంభించవచ్చు.