Early Puberty: ప్రమాదంలో ఆడపిల్లలు.. త్వరగా యవ్వనత్వానికి ఎందుకు వస్తున్నారో తెలుసా.. భయంకరమైన నిజాలు
Early Puberty ఈ మధ్య కాలంలో పిల్లలు తినే జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, మిఠాయిలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు.

Do you know why girls reach puberty early?
ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తున్న ముఖ్యమైన సమస్యలలో ఒకటి ఆడపిల్లలు సాధారణం కంటే ముందుగానే యౌవనదశలోకి (early puberty) రావడం. ఇది ఆరోగ్యపరంగా, మానసికపరంగా, సమాజపరంగా తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. యౌవనదశ అంటే శరీరంలో హార్మోన్ల మార్పులు రావడం. ఈ సమయంలో బ్రెస్టు అభివృద్ధి, మెనస్ట్రుయేషన్ ప్రారంభం వంటివి జరుగుతాయి. సాధారణంగా ఈ దశ 8 నుంచి13 సంవత్సరాల మధ్య ప్రారంభం కావాలి. కానీ, ప్రస్తుత కాలంలో 6 నుంచి 7 ఏళ్ల వయస్సులోనే కొంతమంది ఆడపిల్లల్లో యౌవన లక్షణాలు కనిపించడం మొదలవుతోంది. దీనిని ప్రికోషస్ ప్యూబర్టీ (Precocious Puberty) అంటారు. దీనికి చాలా భయంకంరైన కారణాలే ఉన్నాయి. మరి ఆ విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
త్వరగా యౌవనదశలోకి రావడమవుతున్న భయంకరమైన నిజాలు
1.ఆహారపు రసాయనాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్:
ఈ మధ్య కాలంలో పిల్లలు తినే జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, మిఠాయిలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. వీటిలో కృత్రిమ హార్మోన్లు, ప్రిజర్వేటివ్‌లు, కెమికల్స్ (BPA) వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఎస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. వీటి కారణంగా చిన్న వయస్సులోనే యౌవన లక్షణాలు కనిపించవచ్చు.
2.అధిక బరువు:
అధిక బరువు లేదా మోటాపు ఉన్న పిల్లల్లో ఫ్యాట్ టిష్యూల వల్ల ఎస్ట్రోజెన్ విడుదలవుతుంది. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, యౌవనదశను ముందుగా ప్రారంభించగలదు.
3.హార్మోన్లు ఉన్న మాంసాహారం / పాల ఉత్పత్తులు:
పశువులు, పశుపాల పెరుగుదల కోసం ఈ మధ్య కాలంలో హార్మోన్లు ఉపయోగిస్తున్నారు. ఇవి మనం తినే పాలు, మాంసంలోకి వస్తాయి. ఇలాంటి వాటిని పిల్లలు తీసుకుంటే, వారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలిగి త్వరగా ప్యూబర్టీకి దారితీస్తుంది.
4.డిజిటల్ స్క్రీన్ టైమ్, నిద్రలేమి:
ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్, టీవీ, టాబ్లెట్‌లు వాడుతున్నారు. వీటిని అధికంగావాడటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది, ఇది ప్యూబర్టీని ఆలస్యం చేస్తుంది. కాబాట్టి, దీని తగ్గుదల వల్ల శరీరంలో ఇతర హార్మోన్లు ముందుగానే యాక్టివ్ అవుతాయి.
5.పర్యావరణ కాలుష్య:
ప్లాస్టిక్, కాస్మెటిక్స్, ప్యాకేజ్డ్ వాటర్, సబ్బులు, క్రీములు వంటివి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ (EDCs) ను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్లకు హానికరం. వీటి వల్ల కూడా యౌవనదశ త్వరగా ప్రారంభం అయ్యే ప్రమాదం ఉంది.
త్వరగా యౌవనదశలోకి రావడంవల్ల కలిగే సమస్యలు:
మానసిక సమస్యలు:
చిన్న వయస్సులో శరీరంలో మార్పులు రావడం వల్ల గందరగోళం, డిప్రెషన్, తక్కువ ఆత్మవిశ్వాసం కలగవచ్చు.
సమాజపరమైన ప్రమాదాలు:
చిన్న వయస్సులోనే పెద్దవాళ్ల లుక్స్ రావడం వల్ల పిల్లలపై అసభ్య దృష్టులు పడే ప్రమాదం ఉంది. లైంగిక వేధింపుల ప్రమాదం పెరుగుతుంది.
ఆరోగ్య సమస్యలు:
యుక్త వయస్సులో గర్భాశయ, బ్రెస్టు క్యాన్సర్ లాంటి హార్మోన్ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
తల్లిదండ్రులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఆహారపు అలవాట్లను మార్చాలి
- ప్రకృతిసిద్ధమైన, తక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.
- ఆర్గానిక్ పాలు, పండ్లు, కూరగాయలు తినాలి
- రోజూ 1 గంట వ్యాయామం లేదా ఆటలు అవసరం.
- స్క్రీన్ టైమ్ తగ్గించాలి
- శరీరంలో మార్పులు గురించి పిల్లలకు వివరణ ఇవ్వాలి.
ఆడపిల్లలు త్వరగా యౌవనదశలోకి రావడం అనేది సరళమైన విషయం కాదు. ఇది శారీరక, మానసిక, సామాజిక అన్ని రంగాల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి, తల్లిదండ్రులుగా బాధ్యతగా ఉండాలి. పౌష్టికమైన ఆహారం, సరైన జీవనశైలి, ప్రేమతో కూడిన మార్గదర్శనం ద్వారా ఈ సమస్యను నిరోధించవచ్చు.