Mowgli : యాంకర్ సుమ కొడుకు రెండో సినిమా.. మోగ్లీ గ్లింప్స్ వచ్చేసింది.. నాని వాయిస్ ఓవర్ తో..
యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు.(Mowgli)

Mowgli
Mowgli : యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో విశ్వప్రసాద్ నిర్మాతగా మోగ్లీ సినిమా తెరకెక్కుతుంది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ జంటగా బండి సరోజ్ విలన్ గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.(Mowgli)
నేడు మోగ్లీ గ్లింప్స్ రిలీజ్ చేసారు. నాని ఈ గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వగా రామ్ చరణ్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే అడవిలో పెరిగిన ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఆ అమ్మాయి కోసం విలన్ వెతుక్కుంటూ వస్తే ఏం జరిగింది అనే కథలా ఉండబోతుంది అనిపిస్తుంది.
మీరు కూడా మోగ్లీ గ్లింప్స్ చూసేయండి..
Also See : King Nagarjuna Birthday : నాగార్జున 66వ బర్త్ డే స్పెషల్.. కింగ్ నాగ్ రేర్ ఫొటోలు చూశారా?