Param Sundari Review: జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ రివ్యూ.. నార్త్ అబ్బాయి – సౌత్ అమ్మాయి లవ్ స్టోరీ బాగుందిగా..

జాన్వీ కపూర్ కి పరమ్ సుందరి సినిమాతో అయినా బాలీవుడ్ లో కమర్షియల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.(Param Sundari)

Param Sundari Review: జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ రివ్యూ.. నార్త్ అబ్బాయి – సౌత్ అమ్మాయి లవ్ స్టోరీ బాగుందిగా..

Param Sundari Review

Updated On : August 29, 2025 / 3:47 PM IST

Param Sundari Review: జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘పరమ్ సుందరి’. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మాణంలో తుషార్ జలోటా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పరమ్ సుందరి నేడు ఆగస్టు 29న రిలీజయింది. కేవలం బాలీవుడ్ సినిమాగా హిందీ వర్షన్ మాత్రమే రిలీజయింది.(Param Sundari)

కథ విషయానికొస్తే.. తండ్రి తన బిజినెస్ లను చూసుకొమ్మని చెప్పినా పరమ్(సిద్దార్థ్ మల్హోత్రా) స్టార్టప్స్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటూ ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి(అభిషేక్ బెనర్జీ) ఫైండ్ మై సోల్ మేట్ అనే యాప్ గురించి చెప్పి మన సోల్ మేట్ ని ఈ యాప్ ద్వారా వెతుక్కోవచ్చు అని చెప్తాడు. ఈ ఐడియా నచ్చడంతో దాన్ని మరింత డెవలప్ చేయడానికి తండ్రిని 5 కోట్లు అడుగుతాడు పరమ్. ఇప్పటికే అతనిపై ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన పరమ్ తండ్రి ఫస్ట్ ఆ యాప్ వాడి నీ సోల్ మేట్ ని పట్టుకో అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటాడు.

దీంతో ఆ యాప్ ను ఉపయోగించి అందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం 100 శాతం మ్యాచ్ అయిన సుందరి అనే అమ్మాయి కేరళలో ఉంది అని తెలుస్తుంది. ఆమె తన సోల్ మేట్ అవుతుందా లేదా అని పరమ్ తన ఫ్రెండ్ జగ్గు(మన్ జోత్ సింగ్)తో కలిసి కేరళకు వెళ్తాడు. సుందరి(జాన్వీ కపూర్) పేరెంట్స్ చనిపోవడంతో తన చెల్లితో కలిసి ఉంటూ తన ఇంటిని హోమ్ స్టే గా మారుస్తుంది. దీంతో పరమ్, అతని ఫ్రెండ్ ఆ హోమ్ స్టేలోనే దిగుతారు. పరమ్ సుందరికి మెల్లిమెల్లిగా దగ్గరవుతాడు. కానీ పరమ్ కి ఆల్రెడీ వేణు(సిద్దార్థ్ శంకర్)తో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అలాగే ఆ యాప్ లో డీటెయిల్స్ సుందరి చెల్లి ఎంటర్ చేసిందని తెలుస్తుంది. మరి పరమ్ సుందరిని నిజంగా ప్రేమిస్తాడా? సుందరి పెళ్లి ఎవరితో జరుగుతుంది? ఆ యాప్ వర్కౌట్ అవుతుందా? పరమ్ కి తండ్రి ఇన్వెస్ట్ చేస్తాడా? పరమ్ యాప్ వల్ల తన దగ్గరకు వచ్చాడని సుందరికి తెలుస్తుందా? కేరళలో పరమ్ ఎదుర్కున్న ఇబ్బందులేంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..

సినిమా విశ్లేషణ..

నార్త్ – సౌత్ లవ్ స్టోరీలు గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. కథ పరంగా అయితే ఒక అబ్బాయి అమ్మాయి ఉండే చోటికి వెళ్లి ఆమెతో ప్రేమలో పడి, అక్కడ వాళ్లకు దగ్గరయి ఆమెని పెళ్లి చేసుకోవడం. ఇలాంటివి తెలుగులోనే ఓ వంద సినిమాలు వచ్చి ఉంటాయి. అయితే కథ లీడింగ్ పాయింట్ ఓ యాప్ అంటూ కొత్తగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో బిజినెస్ గురించి, కేరళ కు వెళ్లి అక్కడ హీరోయిన్ తో ప్రేమలో పడటం సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆల్రెడీ సుందరికి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిందని తెలియడంతో తెలియయడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ అంతా రొటీన్. హీరోయిన్ – పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కలిసి ఉండటం చూసి హీరో బాధ పడుతూ ఉండటం.. ఈ సీన్స్ అన్ని చాలా సినిమాల్లో చూసేసాం. చివరకు హీరోయిన్ హీరోని ఎలా పెళ్లి చేసుకుంటుంది అనేది కూడా రొటీన్ డైలాగ్స్ తో కాస్త కామెడీ పెట్టి లాగించేసారు. జాన్వీ అందంగా కనపడినా మలయాళం మాట్లాడటానికి బాగా కష్టపడింది. కేరళలో సినిమా అన్నప్పుడు అక్కడ ప్రకృతి అందాలన్నీ చూపిస్తారు. ఓ పాటలో అవకాశం వచ్చినా పెద్దగా కేరళ అందాలను చూపించలేదు ఈ సినిమాలో. కాకపోతే కేరళ ఓనం పండుగ, అక్కడ ఆడే ఆటలను మాత్రం చూపించారు. మొదటి అరగంట తప్పితే సినిమా అంతా కేరళలోనే జరుగుతుంది.

క్లైమాక్స్ కాస్త సాగదీసారేమో అనిపిస్తుంది. సిద్దార్థ్- జాన్వీ పెయిర్ మాత్రం కెమిస్ట్రీ అదరగొట్టేసారు. పర్ఫెక్ట్ కపుల్ లా ఒక కొత్త జంటలా కనిపిస్తారు. సినిమా విజువల్స్ అందంగా చూపించడంతో ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది. ఈ సినిమాని తెలుగు, మలయాళం లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఆడే అవకాశం ఉంది. యాక్షన్ – సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు నడుస్తున్న సమయంలో ప్యూర్ కామెడీ లవ్ స్టోరీతో వచ్చి మెప్పించారు పరమ్ – సుందరి. జాన్వీకి ఈ సినిమాతో అయినా బాలీవుడ్ లో కమర్షియల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.(Param Sundari)

Param Sundari Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

జాన్వీ కపూర్ కెరీర్ లోనే బెస్ట్ లుక్స్ లో కనిపించింది. కేరళ అమ్మాయిగా చాలా అందంగా కనిపించడమే కాక నటనతో కూడా మెప్పిస్తుంది. బాలీవుడ్ లో అమ్మాయిల ఫేవరేట్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సిక్స్ ప్యాక్ బాడీ లుక్స్ తో కనిపిస్తూ లవ్ స్టోరీలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ సినిమాతో మరోసారి తన లేడీ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడం ఖాయం.

జాన్వీని పెళ్లి చేసుకోబోయే పాత్రలో సిద్దార్థ్ శంకర్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చి బాగానే మెప్పించాడు. సుందరికి కేర్ టేకర్ గా మలయాళం నటుడు రెంజి పానికర్ బాగానే సెట్ అయ్యాడు. సిద్దార్థ్ ఫ్రెండ్ పాత్రలో మన్ జోత్ సింగ్ అక్కడక్కడా నవ్విస్తాడు. జాన్వీ చెల్లి పాత్రలో ఇనాయత్ వర్మ క్యూట్ గా మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ.. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి..

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. ప్రతి విజువల్, ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడు. నార్త్, సౌత్ మ్యూజిక్ మిక్స్ చేసి పర్ఫెక్ట్ గా ఇచ్చారు. పాటలు చాలా బాగున్నాయి. రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు. సినిమా అంతా కేరళలోనే జరిగినా కేరళ లొకేషన్స్, ని సరిగ్గా వాడుకోలేక అక్కడి ప్రకృతి అందాలు అంతగా చూపించలేకపోయాయరు. ఎడిటింగ్ కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసారు. కథకు తగ్గట్టు కలర్ ఫుల్ గా కనిపించడానికి జాన్వీ – సిద్దార్థలకు కాస్ట్యూమ్స్ బాగా డిజైన్ చేసారు. కథ పాతదే అయిన కొత్త లీడ్ తీసుకొని ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

మొత్తానికి ‘పరమ్ సుందరి’ రెగ్యులర్ కథతో సరికొత్తగా నార్త్ – సౌత్ లవ్ స్టోరీకి కాస్త కామెడీ జోడించి తెరకెక్కించిన ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.