Anjali : వామ్మో.. పుట్టిన రోజున మాస్ లుక్స్ తో భయపెడుతున్న అంజలి..

‘బహిష్కరణ’ సిరీస్‌ లో అంజలి మెయిన్ లీడ్ చేస్తుంది.

Anjali : యాబైకి పైగా సినిమాల్లో నటించిన అంజలి ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఓ మాస్ పాత్రలో మెప్పించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్ తో రాబోతుంది. ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మాణంలో ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ఈ సిరీస్‌ లో అంజలి మెయిన్ లీడ్ చేస్తుంది.

Also Read : Fathers Day 2024 : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు విష్ చేస్తూ మన సెలబ్రిటీల పోస్టులు..

విలేజ్ రివేంజ్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతున్న ఈ బహిష్కరణ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. తాజాగా నేడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో.. అంజలి వేట కొడవలి పట్టుకుని కోపంగా చూస్తూ కూర్చుంది. పక్కనే ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. దీంతో మరోసారి అంజలి ఓ మాస్ పాత్రలో అలరించబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ZEE 5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రెండింగ్ వార్తలు