Seethakka : కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది.

Seethakka : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి పేరుతో సినిమా రంగంలోని విభాగాలలో పలువురు కళాకారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పట్నుంచో అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది. ఇటీవలే కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక పోస్టర్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. RV రమణమూర్తి కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.

Also Read : Bosco Martis – NTR : ‘దేవర’ కోసం బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్.. షూట్ లొకేషన్ నుంచి ఎన్టీఆర్‌తో ఫోటో లీక్..

తాజాగా కళావేదిక టీమ్ తెలంగాణ పంచాయతీరాజ్ & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. సీతక్క ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఆహ్వానించగా ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీగా రానున్నారు.

ట్రెండింగ్ వార్తలు