Bosco Martis – NTR : ‘దేవర’ కోసం బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్.. షూట్ లొకేషన్ నుంచి ఎన్టీఆర్‌తో ఫోటో లీక్..

తాజాగా బాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Bosco Martis – NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క దేవర, మరో పక్క వార్ 2 షూటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే దేవర సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.

ఇటీవల దేవర షూటింగ్ కోసం ఎన్టీఆర్ థాయిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే థాయిలాండ్ లో దేవర సినిమాలోని ఒక సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో షేర్ చేసి.. ఎట్టకేలకు వెరీ ట్యాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ గారితో దేవరకు వర్క్ చేస్తున్నాము అని పోస్ట్ చేసాడు. దీంతో దేవర సినిమాలో ఓ సాంగ్ కి ఈ బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Kalki Artists Remunerations : నిజంగానే ‘కల్కి’ సినిమాలో ఒక్కొక్కరికి రెమ్యునరేషన్స్ అంత ఇచ్చారా? ప్రభాస్ కి ఏకంగా..

ప్రస్తుతం బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో వైరల్ అవుతుండగా అభిమానులు.. అదిరిపోయే స్టెప్స్ వేయించండి, ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థాయిలాండ్ లో ఎన్టీఆర్ – జాన్వీ పై ఓ పాట చిత్రీకరించినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు