1962 ఇండో-చైనా యుద్ధ కాలంనాటి మోర్టార్ స్మోక్ బాంబు లభ్యం.. ఆర్మీ ఏం చేసిందంటే..?

1962లో భారత్ - చైనా దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సమయంలో చైనా వినియోగించిన మోర్టార్ స్మోక్ బాంబు అస్సాంలో లభ్యమైంది.

Smoke Bomb Found In Assam

Smoke Bomb Found In Assam : 1962లో భారత్ – చైనా దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సమయంలో చైనా వినియోగించిన మోర్టార్ స్మోక్ బాంబు అస్సాంలో లభ్యమైంది. ఇది చైనాలో తయారుచేసిన బాంబు అని సోనిత్ పూర్ ఎస్పీ తెలిపారు. 1962 యుద్ధంలో ఈ బాంబు దట్టమైన పొగను వ్యాపింపజేయడానికి ఉపయోగించినట్లు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఈ మోర్టార్ స్మోక్ బాంబును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Warangal : వరదల్లో చిక్కుకున్న బస్సు.. రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు

జౌగాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సేసా నదిలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. నదిలో రెండు అంగుళాల పొడవు కలిగిన పేలుడు పదార్థాన్ని గుర్తించాడు. దానిని బయటకు తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని స్థానిక మిసమరి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతని వద్దకు చేరుకొని స్మోక్ బాబును స్వాధీనం చేసుకున్నారు. సోనిత్ పూర్ ఎస్పీ బరున్ పుర్కాయస్త ఆర్మీ సిబ్బందికి సమాచారం అందించారు. లెఫ్టినెంట్ కల్నల్ అభిజీత్ మిశ్రా నేతృత్వంలోని మిసామరి క్యాంప్ కు చెందిన ఆర్మీ బృందం సహాయంతో మోర్టార్ స్మోక్ బాంబును ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Smoke Bomb Found In Assam

మోర్టార్ స్మోక్ బాంబు ఒక రకమైన మందుగుండు సామాగ్రి. శత్రువుల కాల్పులను నివారించడానికి, శత్రువుల నిఘా నుంచి తప్పించుకోవటానికి ఈ స్మోక్ బాంబును వినియోగించేవారని ఎస్పీ తెలిపారు. దీనిని ప్రయోగించడం ద్వారా దట్టమైన పొగ వ్యాపిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు