Kaalam Raasina Kathalu : ‘కాలం రాసిన కథలు’ సక్సెస్ మీట్..

తాజాగా కాలం రాసిన కథలు మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

MNV Sagar Kaalam Raasina Kathalu Movie Success Meet Happened

Kaalam Raasina Kathalu : అందరూ కొత్తవాళ్లతో MNV సాగర్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తనే నిర్మించిన సినిమా ‘కాలం రాసిన కథలు’. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో రిలీజయింది. నాలుగు ప్రేమ కథలు, ఆ ప్రేమకు డబ్బు సమస్య, ఇంట్లో ఒప్పుకోకపోవడం లాంటి సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సినిమా సక్సెస్ మీట్ లో దర్శక నిర్మాత MNV సాగర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక మంచి స్పందన వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ మాకు మంచి రిలీజ్ ఇచ్చారు. మా సినిమాలో స్టార్స్ లేకపోయినా సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమాలోని అన్ని పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో కిరాక్ కిరణ్ పాత్ర బాగా పండింది. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ బాగా నటించారు. హన్విక పాత్రకి బేబీ సినిమాలో వైష్ణవి చైతన్యలాగా, ఆర్ఎక్స్ 100లో పాయల్ లాగా పేరొస్తుంది అని తెలిపారు.

హీరోయిన్ హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన నవ్య పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాత్ర రాసినందుకు, నన్ను ఎంచుకున్నందుకు సాగర్ గారికి ధన్యవాదాలు అని తెలిపారు. ఉమా రేచర్ల మాట్లాడుతూ.. ఈ సినిమాలో కోస్టార్స్ అభిలాష్, శ్రీధర్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పారు. నటుడు వికాస్ మాట్లాడుతూ.. ఈ పాత్ర నా దగ్గరకు వచ్చినప్పుడు చేయగలనో లేదో అనుకున్నాను కానీ సాగర్ నాకు ధైర్యం ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు.