రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. మరోవైపు సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలీకాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read : Rain Alert : తెలంగాణలో వర్ష బీభత్సం.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంవో కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయంకోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగాఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సపచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంకావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

వరద నీటిలో కొట్టుకుపోయిన కారు..
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుండి వరదనీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకపోయింది. కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుళ్లు హైదరాబాద్ విమనాశ్రయానికి వెళ్తున్నారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి కారు నీటిలోకి వెళ్లిపోయింది. తమ కారు వాగులోకి పోయిందని, మా మెడ వరకు నీరు వచ్చిందంటూ నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిలు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు తిరిగి వారికి పోన్లు చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. సంఘటన స్థలం వద్దకు వెళ్లి చూడగా కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని స్థానిక అధికారులకు తెలపగా.. గాలింపు చర్యలు చేపట్టారు.

 

ట్రెండింగ్ వార్తలు