Maha vs Karnataka: ఇది సమాఖ్య దేశం, ప్రతి రాష్ట్రానికి సొంత హక్కులు ఉంటాయి.. కర్ణాటక సీఎం బొమ్మై

ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాగాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్టును మహా ప్రభుత్వం ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులోనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయం యుద్ధం అయితే కొనసాగుతోంది.

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరోసారి పైకి లేచిన వివాదం రోజు రోజుకూ మరింత ఉదృతం అవుతోంది. ఈ విషయమై తాజాగా మహారాష్ట్రలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే వీటిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, నిరసన చేస్తున్న వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయమై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. ప్రతి రాష్ట్రానికి సొంత హక్కులు ఉంటాయి. శాంతిభద్రతలు కొనసాగించడం చట్టపరమైన బాధ్యత. వెనుకబడిన రాష్ట్రాల్లో ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో ఉన్నపళంగా ఎందుకు నిరసన చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఇరు రాష్ట్రాల మధ్య సున్నిత పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని నేను ఎంత మాత్రం సహించను. నిరసన చేస్తున్న వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజల హక్కులు కాపాడడంతో పాటు, వారిని మరింత బాధ్యతగా వ్యవహరించేలా ప్రభుత్వం చొరవ చూపాలి’’ అని అన్నారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాగాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్టును మహా ప్రభుత్వం ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులోనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయం యుద్ధం అయితే కొనసాగుతోంది.

Bengaluru: శృంగారం మధ్యలో మరణించిన 67 ఏళ్ల వ్యక్తి.. భర్త సాయంతో శవాన్ని తరలించిన మహిళ

ట్రెండింగ్ వార్తలు