Allu Arjun Pushpa 2 Title Song Dance Step goes Viral Dance Master Details Here
Pushpa Song : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టు మూవీ యూనిట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచుతుంది. తాజాగా నిన్న పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప.. అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లిరికల్ సాంగ్ విడుదల చేసినా అల్లు అర్జున్ వేసిన ఓ డాన్స్ స్టెప్ ని కూడా రిలీజ్ చేసారు.
Also Read : Rajamouli : అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తా.. రాజమౌళికి కోపం వచ్చిందా?
గతంలో పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ లో నడుస్తూ చెప్పు వదిలేసే స్టెప్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పుష్ప 2 టైటిల్ సాంగ్ లో షూ వదిలేసి వేసే స్టెప్ వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టమైనా స్టెప్ అయినా ఈజీగానే చేసేస్తాడు. అలాగే ఈ షూ స్టెప్ కూడా ఫుల్ గ్రేస్ తో అదరగొట్టేసాడు. దీంతో బన్నీ అభిమానులు స్టెప్స్ అదిరిపోయాయి అని అంటున్నారు.
Here before it's trending ?
Most sensational step of the year #PushpaPushpa @alluarjun ??pic.twitter.com/Q0nBgl7a49
— Sumanth (@SumanthOffl) May 1, 2024
పుష్ప 2 సినిమాకు ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మలు డాన్స్ మాస్టర్స్ గా ఉన్నారు. అయితే ఈ పుష్ప టైటిల్ సాంగ్ లోని షూ స్టెప్ కంపోజ్ చేసింది మాత్రం విజయ్ పోలాకి(Vijay Polaki) మాస్టర్. విజయ్ పోలాకి ఇటీవల వరుసగా మంచి సినిమాలతో ఫామ్ లోకి వస్తున్నాడు. బేబీ, మ్యాడ్, బబుల్ గమ్, హాయ్ నాన్న, భాగ్ సాలె.. ఇలా చాలా సినిమాల్లో గుర్తుండిపోయే స్టెప్స్ వేయించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో పుష్పలో హైలెట్ అయ్యే స్టెప్ వేయించాడు. విజయ్ పోలంకి మాస్టర్ కూడా ఈ స్టెప్ ని వేసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు స్టెప్ బాగుంది అంటూ విజయ్ మాస్టర్ ని అభినందిస్తున్నారు.