Rajamouli : అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తా.. రాజమౌళికి కోపం వచ్చిందా?

ఈవెంట్లో అందరిముందు అనిల్ రావిపూడి సందర్భం కాకపోయినా రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి అడగడంతో..

Rajamouli : అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తా.. రాజమౌళికి కోపం వచ్చిందా?

Rajamouli Sensational Comments on Anil Ravipudi goes Viral

Updated On : May 2, 2024 / 6:59 AM IST

Rajamouli : ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్స్ తో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ అసలు ఈ సినిమా నుంచి అధికారికంగా ఒక్క అప్డేట్ అయినా ఇవ్వమని అడుగుతున్నారు. తాజాగా సత్యదేవ్(Satya Dev) హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా గురించి మాట్లాడిన తర్వాత.. ఈ ఈవెంట్ కి కొరటాల శివ గారు, రాజమౌళి గారు వచ్చారు కాబట్టి కొరటాల శివ గారు దేవర అప్డేట్ ఇవ్వాలి. రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా కనీసం ఓపెనింగ్ ఎప్పుడో చెప్పాలి అని అన్నారు.

Also Read : Krishnamma Trailer : స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ‘క‌థ న‌డ‌క‌కైనా, న‌ది న‌డ‌క‌కైనా మ‌లుపులే అందం..’

రాజమౌళి స్పీచ్ తర్వాత అనిల్ రావిపూడి కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ.. ఎవరైనా కెమెరా పట్టుకొని వెనకాలే వెళ్లి అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తాను అని అన్నారు. అయితే రాజమౌళి స్టేజిపై కామెడీగానే అన్నా కోపం వచ్చింది, అందుకే కౌంటర్ ఇచ్చాడు అని అనుకుంటున్నారు. అసలు రాజమౌళి అంత తొందరగా తన సినిమాల గురించి బయట పెట్టడు. అలాంటిది ఈవెంట్లో అందరిముందు అనిల్ రావిపూడి సందర్భం కాకపోయినా అడగడంతో కోపం వచ్చినా దాన్ని చూపించకుండా కామెడీ కౌంటర్ ఇచ్చాడు అని భావిస్తున్నారు అంతా. మొత్తానికి అనిల్ రావిపూడి మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.