NTR : విజయ్ సినిమా లాగే అప్పట్లో ఎన్టీఆర్ సినిమాని ఆపేసిన సెన్సార్.. నిరాహార దీక్ష చేసిన ఫ్యాన్స్..
సెన్సార్ ఒక సినిమాని ఆపడం ఇదేమి కొత్తకాదు. గతంలో చాలా సార్లు జరిగింది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి కూడా జరిగింది. (NTR)
NTR
NTR : ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ జననాయగన్ సినిమా సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాలో రాజకీయాలకు చెందిన సీన్స్ పై అభ్యంతరాలు ఉన్నాయనే ఈ సినిమాను ఆపుతున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సెన్సార్ ఒక సినిమాని ఆపడం ఇదేమి కొత్తకాదు. గతంలో చాలా సార్లు జరిగింది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి కూడా జరిగింది.
ఎన్టీఆర్ ఓ పక్క సక్సెస్ ఫుల్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే 1982 లో తెలుగువారి కోసం అంటూ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికి ఎన్టీఆర్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో బొబ్బిలి పులి ఒకటి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా ఈ సినిమా తెరకెక్కింది. 1982 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల అవ్వాలి. మార్చ్ లోనే ఎన్టీఆర్ పార్టీ ప్రకటించారు. దీంతో బొబ్బిలిపులి సినిమాకు సెన్సార్ ఇబ్బందులు వచ్చాయి. ఆ సినిమాని అప్పటి ప్రభుత్వం ఆపేసింది ఆరోపణలు కూడా వచ్చాయి.
బొబ్బిలి పులి సినిమా రిలీజ్ సెన్సార్ వద్ద ఆగిపోవడంపై ఎన్టీఆర్ కూడా మీడియాతో స్పందించారు. ఎన్టీఆర్ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఈ సినిమాలో సెన్సార్ వారికి అభ్యంతకరమైన సన్నివేశాలు ఏంటో అర్థం కావట్లేదు. ఆంధ్రదేశం నుండి అనేకమంది అభిమానులు బొబ్బిలిపులి విడుదల ఆలస్యం పట్ల ఆగ్రహం చెందుతూ నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని నా దగ్గరకు వచ్చారు. అతికష్టం మీద వారిని శాంత పరిచాను. లేకపోతే చాలా సమస్యలు ఎదురైయ్యేవి. ఏది ఏమైనా వారి సహనాన్ని పరీక్షిస్తే ఆందోళనకు కూడా వెనుకాడరు అని అన్నారు.
ఎన్టీఆర్ చెప్పినట్టు కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ యువసేన ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గర మే 15న నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కొన్ని రోజుల పాటు ఈ నిరాహార దీక్ష జరిగింది. ఎట్టకేలకు మూడు నెలలు సాగదీసిన తర్వాత సెన్సార్ బోర్డు జులైలో బొబ్బిలిపులి కి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన బొబ్బిలి పులి సినిమా 1982 జూలై 9న విడుదల అయ్యింది. సినిమా లేట్ అయినా, వివాదాలు అయినా రిలీజ్ తర్వాత బొబ్బిలి పులి భారీ విజయం సాధించింది.
Also See : Shagna sri venun : హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఎన్టీఆర్ కెరీర్లో మరో భారీ విజయం సాధించిన సినిమాగా బొబ్బిలిపులి నిలిచింది. అప్పట్లోనే ఈ సినిమా మూడున్నర కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయం ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి కూడా బాగా ఉపయోగపడిందని అంటారు.
