Lavany Tripathi : లావణ్య త్రిపాఠి ఆ సినిమా చేసుంటే.. విజయ్-రష్మిక పెళ్లి అయ్యేది కాదేమో.. మెగా కోడలు ఏం చెప్పిందంటే..
తాజాగా వీరి పెళ్లిపై మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Lavany Tripathi)
Lavany Tripathi
Lavany Tripathi : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పరిచయమయిన ఈ జంట కొన్నేళ్లు ప్రేమ, డేటింగ్ చేసి ఇటీవలే గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లిపై మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమాకు మొదట నన్నే అడిగారు. కథ వినకముందు నో చెప్పాను. కథ విన్న తర్వాత సినిమా చేయడానికి ఓకే చెప్పాను. కానీ కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల ఆ ప్రాజెక్టు మిస్ అయింది. కానీ ఆ సినిమా వల్ల విజయ్ – రష్మిక కలిశారు. వాళ్లిద్దరూ కలవాలని ఆ సినిమా నా నుంచి వెళ్లిపోయిందేమో. ఆ ఇద్దరూ బ్యూటిఫుల్ కపుల్ అని తెలిపింది.
Also Read : Shagna sri venun : హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
విజయ్ – రష్మిక కలిసి చేసిన మొదటి సినిమా గీత గోవిందం. ఆ సినిమాతోనే ఈ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయి డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారని అందరికి తెలిసిందే. ఇప్పుడు లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆ సినిమా విజయ్ – రష్మిక చేయకపోతే ఇప్పుడు వారి పెళ్లి అయ్యేది కాదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
