Oxygen Tank Leak: మహారాష్ట్రలో విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది కరోనా రోగులు మృతి

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాసిక్‌లో ఆక్సిజన్ లీకై తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Oxygen tank leak Zakir Hussain NMC Hospital : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాసిక్‌లో ఆక్సిజన్ లీకై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో బయట ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీక్‌ అయింది. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌లోని జాకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆస్పత్రిలోబుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది.

ఆస్పత్రిలో అనేక మంది కరోనా రోగులు చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు 171 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి బయట ఆక్సిజన్‌ ట్యాంకర్‌లో ప్రాణవాయువు నింపుతుండగా ట్యాంకర్‌ నుంచి లీకైంది. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. నాసిక్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది.


ఆక్సిజన్ ట్యాంకు లీకవడంతో సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది కరోనా రోగులు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్‌పై 171మంది చికిత్స పొందుతున్నారు. 30 నిమిషాల పాటు వెంటిలేటర్లు పనిచేయలేదు. ఆక్సిజన్ బెడ్లపై మరికొంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసు 38,98,262 కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరింది.

ట్రెండింగ్ వార్తలు