Ola Electric Scooter : రూ.499తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోండి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. రూ.499 చెల్లించి ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. బుకింగ్ డబ్బు రిఫండల్ అని పేర్కొంది. ఓలా వెబ్ సైట్ లోకి వెళ్లి దీనిని బుక్ చేసుకోవచ్చు.

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. రూ.499 చెల్లించి ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. బుకింగ్ డబ్బు రిఫండల్ అని పేర్కొంది. ఓలా వెబ్ సైట్ లోకి వెళ్లి దీనిని బుక్ చేసుకోవచ్చు. కాగా కొద్దీ రోజుల క్రితం ట్విట్టర్ వేదికంగా తమ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ ను విడుదల చేసింది కంపెనీ.. ఇదే సమయంలో స్కూటర్ కి సంబందించిన పలు ఫీచర్ల గురించి కూడా వివరించింది. తక్కువ సమయంలో గరిష్ట వేగం అందుకుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే త్వరలో మార్కెట్ లోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ కావాలి అనుకునే వారు బుక్ చేసుకోవాలని తెలిపింది కంపెనీ.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రూ,44,000 వరకు రాయితీ ఇస్తుంది. దీనిపై ఓలా ప్రతినిధులు స్పందించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వాల ప్రోత్సహకాలు మార్కెట్ లో విక్రయాలు పెరిగేలా తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.

కాగా 2020లో తమిళనాడులో ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ యూనిట్ చాలా తక్కువ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. మంచి టెక్నాలజీతోపాటు యాప్ ద్వారా స్టార్ట్ చేసే విధానం ఈ ఓలా స్కూటర్ లో ఉంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే విధంగా దీనిని రూపొందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీనిపై గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు