హైదరాబాద్‌లో జీఎస్టీ రిఫండ్ స్కాం.. నకిలీ పత్రాలతో ఎలా బోల్తా కొట్టించారో తెలుసా?

GST Refund Scam: నకిలీ ధ్రువపత్రాలతో జీఎస్టీ వాపసులు క్లెయిమ్ చేశారు నిందితులు. ఈ-బైక్ లు

హైదరాబాద్‌లో జీఎస్టీ రిఫండ్ స్కాం వెలుగుచూసింది. ఎలక్ట్రికల్ బైక్స్ తయారీ పేరుతో జీఎస్టీ రిఫండ్ స్కామ్ కు పాల్పడింది ముఠా. ఏడు గ్రూపులు కలిసి పెద్ద మొత్తంలో స్కాంకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

దాదాపు 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాయి ఎలక్ట్రికల్ బైక్ కంపెనీలు. ఆ ముఠాకి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరించారు. ముఠా సభ్యులు నకిలీ పత్రాలతో ఈ స్కామ్ కు పాల్పడ్డారు. ప్రభుత్వం దగ్గర నుంచి జీఎస్టీలో రిఫండ్ తీసుకుంది ముఠా.

ఢిల్లీ కి చెందిన చిరాగ్ శర్మ, కడపకు చెందిన వేమిరెడ్డి రాజా, ముమ్మగారి గిరిధర్ రెడ్డి, కొండ్రాగుంట వినీల్ చౌదరి అరెస్ట్ అయ్యారు. అలాగే, నల్గొండ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ పీటల స్వర్ణ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అబిడ్స్ కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కలెం వేణుగోపాల్, మాదాపూర్ కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పొదిల విశ్వ కిరణ్, మాదాపూర్ కమర్షియల్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ వేమవరపు వెంటక రమణ, మాదాపూర్ సర్కిల్ సీనియర్ టాక్స్ అధికారి మర్రి మహితను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిని రిమాండ్ కు తరలించారు సీసీఎస్ పోలీసులు. నకిలీ ధ్రువపత్రాలతో జీఎస్టీ వాపసులు క్లెయిమ్ చేశారు నిందితులు. ఈ-బైక్ లు తయారు చేయకుండ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లగించి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు అధికారులు.

అరెస్టయిన జీఎస్టీ అధికారులు లిస్టు..

  • పీతల స్వర్ణ కుమార్, జిఎస్టీ నల్గొండ డిప్యూటీ కమిషనర్
  • కేలం వేణుగోపాల్, అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర పన్నులు, అబిడ్స్ సర్కిల్
  •  పొదిల విశ్వ కిరణ్, అసిస్టెంట్ కమిషనర్, రాష్ట్ర ఓనులు, మాదాపూర్ 1సర్కిల్
  • వేమవరపు వెంకటరమణ , డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర పన్ను అధికారి, జిఎస్టీ మాదాపూర్ 1 సర్కిల్
  • మర్రి మహిత, సీనియర్ అసిస్టెంట్, మాదాపూర్ 3 సర్కిల్

Also Read: ఎంపీ టికెట్ వద్దని వాపస్ ఇచ్చేసిన కాంగ్రెస్ మహిళా నేత సుచరిత మహంతి

ట్రెండింగ్ వార్తలు