టీఈఎస్-43 కోర్సు పూర్తి చేసిన 20 మంది క్యాడెట్లు.. దేశ సేవే తరువాయి..

సీనియర్ అధికారులు, క్యాడెట్ల తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొన్నారు.

టీఈఎస్-43 (టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-43) కోర్సుకు చెందిన 20 మంది క్యాడెట్లు మూడు సంవత్సరాల క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ను పూర్తి చేసుకున్నారు. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఈ కోర్సును పూర్తి చేశారు.

కోర్సును పూర్తి చేసిన వారి కోసం సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో ఇవాళ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఎస్ఎమ్, కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నేహాజరయ్యారు. అలాగే, సీనియర్ అధికారులు, క్యాడెట్ల తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొన్నారు.

క్యాడెట్లు, వారి తల్లిదండ్రులను నీరజ్ వర్ష్నే అభినందించారు. ఆర్మీ కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నందుకు క్యాడెట్లను కొనియాడారు. సమస్యలను ఎదుర్కోవడానికి సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

Also Read : ఐదంచెల విధానంలో మిశ్రమ పండ్ల తోటల సాగు

Also Read: లాభాలు పండిస్తున్న వేరుశనగ పంట.. తక్కువ సమయంలోనే పంట చేతికి

ట్రెండింగ్ వార్తలు