Telangana : వైన్స్‌, బార్ షాపుల లైసెన్స్‌ గడువు పొడిగింపు

మద్యం షాపుల లైసెన్సుల గడువు నెల పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో మద్యం షాపుల యజమానులకు నష్టం రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana : మద్యం షాపుల లైసెన్సుల గడువు నెల పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్ షాపులు మూతపడటంతో వైన్ షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయామని ఇందుకు పరిహారంగా గడువు పొడిగించాలని వైన్ షాపుల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం లైసెన్స్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Read More : Bengaluru Tragedy :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..ఆకలితో అల్లాడి చనిపోయిన పసిబిడ్డ

ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్‌ 31 వరకు కొనసాగనున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడిన కారణంగా అదనంగా నెల పాటు పొడిగిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే మార్జిన్‌ శాతాన్ని 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో 2,200కుపైగా మద్యం షాపులు ఉన్నాయి. కరోనా కాలంలో నేపథ్యంలో బార్లకు ఆదాయం తగ్గడంతో ఒక నెల లైసెన్స్‌ ఫీజు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వైన్స్ యజమానులకు నష్టం భారీగా ఉండటంతో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Read More : Model Dairy : మోడల్ డైరీ ఓనర్ దారుణ హత్య

ట్రెండింగ్ వార్తలు